Advertisement
Google Ads BL

ప్రియా వారియర్‌ మరోసారి ఊపేస్తోంది..!


ప్రియా ప్రకాష్‌ వారియర్‌.. ఈమె గురించి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఒకే ఒక్క కన్నుగీటుతో ఆమె యావత్‌ దేశాన్ని, సినీ ప్రియులను ఊర్రూతలూగించింది. ఈమె నటించిన 'ఒరు ఆధార్‌ లవ్‌'లోని 'మాణిక్య మలరయ' పాటలో కేవలం కొన్ని సెకన్లు పాటు కనిపించిన ఆమె కన్నుగీటుతనం చూసి కుర్రకారునుంచి పండుముదుసలి వరకు, రిషికపూర్‌ నుంచి అల్లుఅర్జున్‌ వరకు అందరు ఆమెకి దాసోహం అనేశారు. 

Advertisement
CJ Advs

ఇక ఇటీవల కొంతకాలం కిందట ఆమె ముంబైలో నిర్వహించిన బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొంది. మరాఠీ సంప్రదాయం ప్రకారం చక్కగా చీరకట్టుకుని ఈమె పోయిన ఒగలు, హోయలు చూసి మరోసారి అందరు ఆమె పేరే జపిస్తున్నారు. అక్కడ ఆమె అందంతోనే కాదు..తన సమాధానాలతో కూడా న్యాయనిర్ణేతలను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

తనకు సినిమాలలో మంచి పేరు తెచ్చుకోవాలని ఉందని, సంగీతం అంటే చాలా ఇష్టమని, తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ర్యాంప్‌ వాక్‌ చేసింది. ఈ వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. ఆమె నడకతీరు హంసలను, మయూరిని తలపిస్తోందని నెటిజన్లు కామెంట్స్‌పెడుతున్నారు. ఇక ఆమె నటించిన మొదటి చిత్రం 'ఒరు ఆధార్‌ లవ్‌' చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుంది. 

Priya Varrier ramp walk video Sensation in Social Media:

Priya Prakash Varrier's one more video Hulchal in SM
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs