ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్న సాయి ధరమ్ తేజ్ హీరోగా నిలబడ్డానికి బాగా ట్రై చేస్తున్నాడు. వరసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ.. హిట్ మాత్రం పడడం లేదు. ప్రసుతం కరుణాకరన్ దర్శకత్వంలో తేజ్ ఐ లవ్ లో నటించిన సాయి ధరమ్ తేజ్ ఆ సినిమా హిట్ అవుతుందని నమ్ముతున్నాడు. రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తేజ్ ఐ లవ్ యు సినిమాపై ట్రేడ్ లో మంచి బజ్ ఉంది. అయితే ఈ సినిమా తర్వాత తేజ్ మరో దర్శకుడికి కనెక్ట్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. అది కూడా ఈడు గోల్డ్ ఎహే తో ప్లాప్ లో ఉన్న వీరు పోట్లకి సాయి ధరమ్ తేజ్ ఓకె చెప్పినట్టుగా తెలుస్తుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో చారిత్రాత్మక కథలపై దర్శకులు ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఇప్పటికే బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేసాడు. ఇక చిరంజీవి చరిత్రాత్మక చిత్రం సైరా నరసింహ రెడ్డి సినిమా చేస్తున్నాడు. అందుకే టాలీవుడ్ దర్శకులంతా చారిత్రాత్మక కథల వెంట పడ్డారు. ఇక ఇప్పుడు వీరు పోట్ల కూడా సాయి ధరమ్ తేజ్ తో కృష్ణదేవరాయల కాలంనాటి ఒక కథను చెయ్యడానికి సిద్దమయ్యాడట. మరి కృష్ణదేవరాయల కాలంనాటి ఒక కథను రెడీ చేసుకుని.. సాయి ధరమ్ కి వినిపించగా... కథ కాస్త డిఫరెంట్ గా ఉండడంతో...దీనికి సాయి ధరమ్ తేజ్ వెంటనే ఓకే చెప్పేశాడట.
ఇక తేజ్ ఐ లవ్ యు విడుదలైన తర్వాత వీరు పోట్ల - సాయి ధరమ్ తేజ్ ల ప్రాజెక్ట్ కి సంబందించిన వివరాలు అధికారికముగా ప్రకటిస్తారని తెలుస్తుంది. అయితే మరో పక్క సాయి ధరమ్ తేజ్ ఇలాంటి కథతో సినిమా చేస్తే వర్కౌట్ అవుతుందా అనే డౌట్ మాత్రం వస్తుంది. ఎందుకంటే కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలా చారిత్రాత్మక చిత్రాలు చెయ్యడం అనేది కరెక్ట్ కాదని కొందరి వాదన.