'బాహుబలి' ఎన్ని సంచలనాలను క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 'బాహుబలి ది బిగినింగ్' కంటే.. 'బాహుబలి ది కంక్లూజన్' దంచికొట్టిన వసూళ్లయితే ఉత్తరాది పెద్దలకే దిమ్మతిరిగిపొయ్యేలా చేశాయి. బాలీవుడ్ లో స్టార్ హీరోస్ గా చెప్పుకునే సల్మాన్, ఆమిర్, షారుఖ్‌లు సైతం ప్రభాస్ రికార్డ్స్ ని బీట్ చేయలేక ఆ ఛాన్స్ కోసం చూస్తున్నారు.
అయితే తాజాగా సంజయ్‌దత్ బయోపిక్ గా రూపొందిన ‘సంజు’ సినిమా సైతం 'బాహుబలి'ని టచ్ చేయడంలో విఫలమైంది. ముఖ్యంగా ఫస్ట్ వీక్ ఎండ్ దగ్గర ‘బాహుబలి ది కంక్లూజన్’ క్రియేట్ చేసిన రూ. 128 కోట్ల బెంచ్ మార్క్ ను.. 'సంజు' రూ.120 కోట్లు కొల్లగొట్టి.. కాస్త దగ్గరలో ఆగిపోయింది. ఆ తర్వాత స్థానంలో సల్మాన్ భాయ్ సినిమాలు 'టైగర్ జిందా హై' (రూ.114 కోట్లు), 'సుల్తాన్' (రూ. 104 కోట్లు) లు నిలబడ్డాయి.
ఆమిర్ ఖాన్ ‘దంగల్’ కూడా ఫస్ట్ వీకెండ్ వసూళ్ళలో రూ. 104 కోట్ల దగ్గరే ఆగిపోయింది. సో దాంతో 'బాహుబలి' ఫస్ట్ వీక్ ఎండ్ రికార్డు సేఫ్ అయింది. మన తెలుగు సినిమా ఇంతలా ఇండియా మొత్తం విజయం సాధించటం గొప్ప విషయమే మరి.