Advertisement
Google Ads BL

'బిగ్‌బాస్‌' నుంచి వచ్చేసి.. నానిపై పొగడ్తలు!


నేచురల్‌స్టార్‌ నాని హోస్ట్‌ చేస్తున్న 'బిగ్‌బాస్‌' సీజన్‌2 రానురాను ఆసక్తికరంగా మారుతోంది. మొదట్లో కాస్త తడబడిన నాని రాను రాను షోని రక్తికట్టిస్తూ తన పాత్రను సరైన న్యాయం చేస్తున్నాడు. సాధారణంగా ఎవరైనా ఒక కొత్త పని చేసిన, చేపట్టిన వెంటనే నిర్ణయం చెప్పడం సరికాదు. అలా తీసుకుంటే 'మీలో ఎవరు కోటీశ్వరుడు'లో చిరంజీవి, 'బిగ్‌బాస్‌' సీజన్‌1లో మొదట్లో ఎన్టీఆర్‌లు కూడా తడబడినా రానురాను పుంజుకుంటూ వచ్చారు. 

Advertisement
CJ Advs

ఇక నాని హోస్టింగ్‌పై తాజాగా ఈ షో నుంచి ఎలిమినేట్‌ అయిన దామరాజు కిరిటీ ప్రశంసల వర్షం కురిపించాడు. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ భవిష్యత్తు నాని మాటలపై ఆధారపడి ఉందని, నిజానికి ఆయన అద్భుతమైన హోస్ట్‌ అంటూ ప్రశంసలు కురిపించాడు.  ఇక ఈ షో గురించి దామరాజు కిరిటీ మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్‌ హౌస్‌'లో అనుభవాలు, అనుభూతులు మర్చిపోలేనివి, అలాంటి హౌస్‌ నుంచి బయటకు రావడం ఎంతో బాధగా ఉంది. ఈ హౌస్‌లో ఎవరికి తోచినట్లు వారు ఆడుతున్నారు. ఇక్కడ ఎలాంటి కుట్రలు గానీ కుతంత్రాలు గానీ లేవు. 

బిగ్‌బాస్‌ సీజన్‌2ని గెలిచే సత్తా కొందరిలో ఉంది. మరీ ముఖ్యంగా తేజస్వినికి ఆ చాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఈ షో ద్వారా నాకు బాబుగోగినేనితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన మాటలను మర్చిపోలేను అంటూ తన అనుభవాలు చెబుతూ, బిగ్‌బాస్‌ని నడుపుతున్న నానిపై ప్రశంసల వర్షం కురిపించాడు. మరి విజేత విషయంలో దామరాజు కిరీటీ మాట నిజం అవుతుందో కాదో వేచిచూడాల్సివుంది....! 

Damaraju Kiriti praises bigg boss season 2 Host Nani:

Damaraju Kiriti Latest interview Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs