ప్రస్తుతం రానా దగ్గుబాటి నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాల్లో ‘హిరణ్యకశ్యప’ కూడా ఒకటి. ఎప్పటి నుంచో రానాతో ఇటువంటి సినిమా తీయాలనుకున్నాడు డైరెక్టర్ గుణశేఖర్. 'రుద్రమదేవి' సినిమా తర్వాత వెంటనే ఈ సినిమాను స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు గుణశేఖర్. కానీ ప్రీ ప్రొడక్షన్ పనులతో ఈ సినిమా లేట్ అయ్యింది.
పురాణగాధల్లో ఒకటైన ‘హిరణ్య కశ్యపుడు – భక్త ప్రహ్లాద’ల కథ ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సుమారు రూ.180 కోట్ల వరకు ఖర్చవుతుందని నిర్మాత సురేష్ బాబు భావిస్తున్నారట.
లేటెస్ట్ గా అయన మీడియాతో మాట్లాడుతూ..ప్రముఖ ఆర్టిస్ట్ ముఖేష్ సింగ్ ఈ సినిమా కోసం అవసరమైన ఇంద్రలోకం, వైకుంఠం వంటి సెట్స్ ను గీస్తున్నారు. విజువల్ వండర్ గా తెరకెక్కునున్న ఈ చిత్రంను ముందుగా లండన్ లోని ఒక స్టూడియోలో చిత్రీకరిద్దాం అనుకున్నాము.. కానీ ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నామని.. సురేష్ బాబు తెలిపారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది మొదట్లో మొదలయ్యే అవకాశాలున్నాయి.