Advertisement
Google Ads BL

ఆ హీరోయిన్‌ గట్టిగా కౌగిలించుకోమని చెప్పింది!


తమిళంలో వర్ధమాన నటుల్లో అర్జున్‌ ఒకరు. ఈయన 'పుగల్‌' చిత్రం ద్వారా నటునిగా పరిచయం అయ్యాడు. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఆర్య, బాబీ సింహా హీరోలుగా నటించిన 'బెంగుళూరు డేస్‌'లో రాయ్‌లక్ష్మికి లవర్‌గా నటించాడు. ఇక 'ఎక్స్‌ వీడియోస్‌' చిత్రంతో ఈయనకు బాగా పేరొచ్చింది. ఈయన తన నటనాప్రస్థానం గురించి చెబుతూ, నాకు మొదటి నుంచి బిడియం ఎక్కువ. దాంతో కెమెరా ముందుకు వెళ్లితే బిడియం పోతుందని చెప్పి స్నేహితులు మోడలింగ్‌ రంగంలోకి పంపారు. 

Advertisement
CJ Advs

ఆ సమయంలోనే విష్ణు అనే స్నేహితుని ద్వారా నటన, డ్యాన్స్‌లో అనుభవం ఉన్న వారు 'పుగల్‌' చిత్రానికి కావాలని తెలియడంతో సెలక్షన్స్‌కి వెళ్లి సెలక్ట్‌ అయ్యాను. ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేసి ట్రైనింగ్‌ కోసం అపోలో హాస్పిటల్‌లో రిసెప్షనిస్ట్‌గా జాయిన్‌ అయ్యాను. అదే సమయంలో సూర్య హీరోగా నటించిన చిత్రం షూటింగ్‌ అపోలో హాస్పిటల్‌లో జరిగింది. ఆ చిత్రంలో నటించిన రమ్య అనే ఆర్టిస్టు ద్వారా 'బెంగుళూర్‌డేస్‌'లో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం షూటింగ్‌ సందర్భంగా రాయ్‌లక్ష్మిని గట్టిగా కౌగిలించుకునే సీన్‌ చేయాల్సివచ్చింది. నేను భయపడుతూ ఉంటే రాయ్‌లక్ష్మినే భయం లేదు.. గట్టిగా కౌగిలించుకోమని ప్రోత్సహించింది. 

ఇక ఇంతకంటే ఆ చిత్రంలో బాబీ సింహాతో ఓ ఫైట్‌ ఉంది. దాని కోసం అనేక టేక్‌లు తీసుకున్నాను.ఇక 'బెంగుళూర్‌డేస్‌' తర్వాత ఆ చిత్రం అసోసియేట్‌ సుజో సుందరం ద్వారా ఎక్స్‌ వీడియోస్‌లో చాన్స్‌ వచ్చింది. ఈ చిత్రం చూసిన వారందరూ అసలు నీకు పెద్దగా అనుభవం లేదంటే నమ్మలేకపోతున్నామని అంటున్నారు అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ యువనటుడు ప్రియురాలిని ఎలా కౌగిలించుకోవాలి? అనే విషయం రాయ్‌లక్ష్మీ ద్వారా ట్రైనింగ్‌ తీసుకున్నాడన్నమాట...!

Heroine Raai Laxmi said dont fear Hug me Arjun :

Raai Laxmi Said Dont Fear Hug me Says Arjun
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs