Advertisement
Google Ads BL

నందమూరి వారసుడికి పేరు పెట్టారయ్యా..!!


రాజమౌళి సినిమా కోసం ఎన్టీఆర్ అక్టోబర్ కి ఖాళీ అయ్యేందుకు.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. ఇక కెరీర్ లో ఎంత సంతోషంగా ఉన్నాడో.. ఎన్టీఆర్ నిజ జీవితంలోను అంతే హ్యాపీ గా వున్నాడు. ఎన్టీఆర్ ఇప్పటివరకు ఒక కొడుకుతోనే అంటే అభయ్ రామ్ తో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ ఫ్యామిలీలోకి మరో బుడతడు వచ్చాడు. ఎన్టీఆర్ కి సెకండ్ టైం కూడా బాబు పుట్టాడు. ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి.. ఎన్టీఆర్ కి రెండోసారి కూడా వారసుడినే ఇచ్చింది. 

Advertisement
CJ Advs

ఇక ఎన్టీఆర్ తనకి రెండో కొడుకు పుట్టిన సంగతిని సోషల్ మీడియా ద్వారా తన కుటుంబం పెద్దదయిందని... తన ఫ్యామిలీలోకి సంతోషాలు మరిన్ని వచ్చాయని చెప్పాడు. అలాగే  తన పెద్దకొడుకు అభయ్ రామ్ చిన్న కొడుకుని ఎత్తుకుని ఉన్న ఫోటో ఎన్టీఆర్ తన ఫోన్ లో బందిస్తుండగా... లక్ష్మి ప్రణతి పెద్ద కొడుకు చిన్న కొడుకు, ఎన్టీఆర్ లను హోల్సేల్ గా ఫోటో తియ్యగా.. ఎన్టీఆర్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. తాజాగా ఎన్టీఆర్.. తన భార్య, ఇద్దరు కొడుకలతో ఒక ఫోటోకి ఫోజిచ్చారు. అది కూడా చిన్న కొడుకు పేరు పెట్టే ఫంక్షన్ లో. చిన్న కొడుకు పేరు భార్గవరామ్ గా నామకరణం చేశారు. 

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ ఫొటోలో ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ ని ఎత్తుకుని మురిపంగా చూస్తుండగా... పెద్ద కొడుకు అభయ్ రామ్ తండ్రి భుజం మీద వంగుని తమ్ముణ్ణి చూసుకుంటున్నాడు. ఇక ఎన్టీఆర్ భార్య.. లక్ష్మి ప్రణతి కూడా ఎన్టీఆర్ చేతుల్లో ఉన్న చిన్న కొడుకు భార్గవరామ్ ని చూసుకుంటూ సంతోష పడుతున్న ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాతో పాటుగా ఇంటర్నెట్ మాయాజాలంలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్ ని చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం ఎక్కడా ఆగడం లేదు. తమ హీరో ఇలా ఫ్యామిలీతో సంతోషంగా ఉండడాన్ని చూసి ఆనందపడిపోతున్నారు.

NTR Younger Son Bhargav Ram Naming Ceremony:

<h1><span style="font-weight: normal;">NTR 2nd Son Bhargava Ram</span></h1>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs