Advertisement
Google Ads BL

'సంజు' అక్కడ కుమ్మేస్తున్నాడు..!


ది గ్రేట్‌ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరాణి దర్శకత్వంలో ఖల్‌నాయక్‌ సంజయ్‌దత్‌ జీవిత గాధగా రూపొందిన చిత్రం 'సంజు'. ఈ చిత్రంలో దర్శకుడు నటీనటుల నుంచి ఆయన రాబట్టుకున్న అవుట్‌పుట్‌ అద్భుతమని అందరు ప్రశంసిస్తున్నారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు తమ పాత్రలకు జీవం పోశారు. ఈ చిత్రం చూసేందుకు టాలీవుడ్‌ ప్రముఖుల నుంచి సినీ అభిమానులందరూ క్యూ కడుతున్నారు. 

Advertisement
CJ Advs

'మహానటి' తర్వాత మరలా 'సంజు'ని చూసి బయోపిక్‌లంటే ఇలా తీయాలి? అనే విధంగా వాటిని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో సంజయ్‌దత్‌ బాడీలాంగ్వేజ్‌ నుంచి మేకోవర్‌, డైలాగ్‌ డెలివరీ ఇలా ప్రతి విషయంలోనూ 'సంజు' పాత్రను చేసిన రణబీర్‌కపూర్‌ అద్భుతంగా చేశాడు. ఈ చిత్రం రణబీర్‌ కెరీర్‌లోనే కాదు.. రాజ్‌కుమార్‌ హిరాణి కెరీర్‌లో ఐదో ఆణిముత్యమనే టాక్‌ వినిపిస్తోంది. ఇక రణబీర్‌ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలవడం ఖాయమని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. 

ఇక ఈ చిత్రం కలెక్షన్లనను తాజాగా ట్రేడ్‌ ఎనలిస్ట్‌ తరుణ్‌ ఆదర్శ్‌ ట్వీట్స్‌ ద్వారా తెలిపాడు. విడుదలైన మొదటి రోజు రూ.34.75కోట్లు రాబట్టిన ఈ చిత్రం ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన చిత్రాలలో టాప్‌పోజిషన్‌లో ఉంది. ఇక రెండు, మూడు రోజులకి ఇది మరింతగా కలెక్షన్లు పెంచుకుని రెండో రోజురూ.38.60కోట్లు, మూడో రోజు రూ.46.71 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో అత్యధికంగా వారాంతపు వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇలా రోజురోజుకి ఈ చిత్రం కలెక్షన్లు మరింతగా దూసుకెళ్లుతుండటం విశేషం. 

Sanju tsunami on Box Office:

Sanju first weekend collections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs