పోలీసులు ప్రశ్నించారు కానీ ఫస్ట్ టైమ్: మెహ్రీన్!


కొన్ని రోజులు క్రితం టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ని అమెరికా పోలీస్ లు చికాగో సెక్స్ రాకెట్ విషయంలో అమెరికాలో ప్రశ్నించినట్టుగా... తర్వాత ఆమె చెప్పిన సమాధానాలు విన్న అమెరికా పోలీస్ లు మెహ్రీన్ కౌర్ కి సారి చెప్పి మరీ పంపెయ్యడమనే న్యూస్ వచ్చింది. అయితే ఈ విషయమై మెహ్రీన్ ఏ సందర్భంలోను ఎక్కడా మాట్లాడలేదు. కానీ మెహ్రీన్ ని అమెరికా పోలీస్ లు ప్రశ్నించినట్టుగా సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో కూడా వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయమై మెహ్రీన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. గత కొన్ని రోజులుగా అమెరికాలోని చికాగోలో సౌత్ హీరోయిన్స్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే న్యూస్ మాత్రం ఒక ఊపు ఊపుతుంది.

అయితే ఆ సమయంలోనే తన పేరెంట్స్ తో పాటుగా అమెరికాకి  వెళ్లిన మెహ్రీన్ ని ఎయిర్ పోర్ట్ లోనే అమెరికా పోలీస్ లు ప్రశ్నించినట్లుగా వచ్చిన వార్తలు నిజమేనట. తాజాగా పంతం సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కి వైరల్ ఫీవర్ వల్ల రాలేకపోయిన మెహ్రీన్ తన మీద ఓ ఇంగ్లీష్ పేపర్ లో వచ్చిన న్యూస్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తనని అమెరికా అధికారులు అరగంట పాటు విచారించినట్టు ఆ పేపర్ రాసిన మేటర్ పై మెహ్రీన్ ఫైర్ అయ్యింది. తాను అమెరికా వెళ్లొచ్చాక ఎవరికీ ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదని... నా అనుమతి లేకుండా నా ఇంటర్వ్యూ అంటూ ఎవరో ఎదో రాస్తో ఊరుకోనని చెప్పిన మెహ్రీన్ తనని అమెరికా అధికారులు ప్రశ్నించిన విధానాన్ని వివరించింది.

తన తల్లితండ్రులతో కలిసి తాను కెనడా నుండి లాస్ వేగాస్‌కు వీకెండ్ హాలిడే కోసం అమెరికా వెళ్లానని... అక్కడ ఎయిర్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ కోసం అధికారుల వద్దకు వెళ్లినపుడు తనను హీరోయిన్‌గా గుర్తించిన అధికారులు... అమెరికా రావడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారని... అయితే తనని ఇలా ప్రశ్నించడానికి గల కారణం చికాగో సెక్స్ రాకెట్ వలన అని చెబితే ఆశ్చర్యపోయానని... అయితే నేను చికాగో సెక్స్ స్కాండల్ గురించి మొదటిసారి విన్నానని.. అసలలాంటి విషయాలతో తనకెలాంటి సంబంధం  లేదని చెప్పగా... అక్కడి అధికారులు నేను చెప్పిన దాన్ని నమ్మి నాకు సారి చెప్పారని... అలాగే ఈ విషయమై ఇంతవరకు నేను ఎక్కడా మాట్లాడలేదని.. మొదటిసారి ఏ విషయమై మాట్లాడుతున్నానని... కొంతమంది చేసే పనుల వలన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది అంటూ.. మెహ్రీన్ కౌర్ తన అమెరికా పర్యటనపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

US Officials Questioned Mehreen, But:

Mehreen Kaur On US Officials Questioned Her In Chicago Sex Racket
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES