Advertisement
Google Ads BL

నాగ్, నాని.. దేవ, దాసుగా!!


గత కొంత కాలం నుండి టాలీవుడ్ లో మల్టీస్టారర్ల గాలి వీస్తుంది. ఈ కోవలోనే నాగార్జున - నాని  కలయికలో కొన్ని నెలల కిందటే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి దాదాపు టాకీ పార్ట్ పూర్తయింది. వచ్చే నెలలో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 12న విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement
CJ Advs

త్వరలోనే ఫస్ట్ లుక్ తో పాటు టీజర్.. ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు టీం. అయితే ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేయలేదు టీం. చాలా టైటిల్స్ అనుకున్నా.. అవిఏమి ఫైనలైజ్ కాలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఓ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘దేవదాసు’ సినిమా పేరునే దీనికి పెడుతున్నారట.

ఇందులో హీరోల పేర్లు దేవ..దాసు. అందుకే టైటిల్ కూడా 'దేవదాసు' అనే ఫిక్స్ చేసారు యూనిట్. 

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం చేస్తున్న ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ్ డాన్ పాత్రలో..నాని డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. నాగ్ సరసన ‘మళ్ళీరావా’ ఫేమ్ ఆకాంక్ష సింగ్ నటిస్తోంది. నానికి జోడీగా ‘ఛలో’ భామ రష్మిక మందన్నా నటిస్తోంది.

Nag-Nani Dissect Iconic Drunkard:

Nagarjuna, Nani film titled Devadasu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs