Advertisement
Google Ads BL

'వీరరాఘవ'కి ఎదురే లేదు..!


ఈ ఏడాదిలో పెద్ద సినిమాల్లో ఎన్టీఆర్ 'అరవింద సమేత' సినిమా తప్ప ఇంకేమి లేవు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈసారి కలెక్షన్స్ అదిరిపోతాయి అని భావిస్తున్నారు. దసరా సందర్భంగా వస్తున్న ఈ సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. దసరా పెద్ద సీజన్ కనుక మరిన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి.

Advertisement
CJ Advs

అందులో నాగార్జున - నాని మల్టీస్టార్రర్ మూవీ దసరా రిలీజ్ లిస్ట్ లో వుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం చేస్తున్న ఈ సినిమా దాదాపు టాకీ పార్ట్ పూర్తయింది. యాక్షన్ ప్లస్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున మాఫియా డాన్‌గా కనిపించనున్నాడు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య చెప్పిన కథకు నాని, నాగ్ ఇంప్రెస్స్ అయ్యి తమ సినిమాలన్నీ వాయిదా వేసి మరీ ముందుగా ఇది పూర్తి చేస్తున్నారు.

అయితే ఈ చిత్రం 'అరవింద సమేత'కి ముందు రిలీజ్‌ అవుతుందో, తర్వాత రిలీజ్‌ అవుతుందో తెలియదు. ఇవే కాకుండా మరిన్ని మీడియం బడ్జెట్ సినిమాలు ఈ దసరాకు రిలీజ్ అవుతున్నాయి. ఎన్ని సినిమాలు పోటీగా వచ్చినా.. ఈసారి కచ్చితంగా హిట్ కొట్టేది త్రివిక్రమే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాతో త్రివిక్రమ్ బౌన్స్ బ్యాక్ అవుతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

No Competition To Aravinda Sametha Veera Raghava:

Vijaya Dasami Release Movie Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs