Advertisement
Google Ads BL

క్లారిటీ ఇచ్చాడుగా.. ఇక ఆపుతారా?


'లై, ఛల్ మోహనరంగా' సినిమాల్తో కాస్త కష్టాల్లో ఉన్న నితిన్ ప్రస్తుతం దిల్ రాజునే నమ్ముకున్నాడు. ఎందుకంటే సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో హిట్ దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కుటుంబ కథా చిత్రం శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటిస్తున్నాడు . అందాల భామ రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా వచ్చేనెల 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్రం తర్వాత నితిన్ ఛలో దర్శకుడు వెంకీ కుడుముల కి కమిట్ అయ్యాడు.

Advertisement
CJ Advs

అయితే వెంకీ కుడుముల డైరెక్షన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పేరు భీష్మ అంటూ... ప్రచారం జరిగింది. ఈసారి నితిన్ భీష్మ గా కనిపించబోతున్నాడు అని.. అలాగే నితిన్ ఉన్న భీష్మ మోషన్ పోస్టర్ తో అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో హల్చల్ చేశాయి. అలాగే... భీష్మ సినిమాలో నితిన్ సరసన హన్సిక నటించనుందని కూడా అన్నారు. గతంలో నితిన్ తో హన్సిక సీత రాముల కళ్యాణం సినిమాలో నటించింది. అయితే అప్పట్లో ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఇక నితిన్ - వెంకీ కుడుముల సినిమాపై వస్తున్నా గాసిప్స్ పై తాజాగా దర్శకుడు వెంకీ కుడుముల క్లారిటీ ఇచ్చాడు.

వెంకీ కుడుముల చెప్పిన వర్షన్ ప్రకారం నితిన్ హీరోగా తన దర్శకత్వంలో రాబోయే సినిమా స్క్రిప్ట్ ఇంకా పూర్తి కానప్పుడు మోషన్ పోస్టర్ ఎలా విడుదల చేస్తాము. అలాగే భీష్మ గా నితిన్ ఉన్న ఆ మోషన్ పోస్టర్ ఒరిజినల్ కాదని... గాసిప్స్ ని నమ్మొద్దని.. తననుండి  బెస్ట్ వర్క్ కావాలంటే కొంత సమయం పడుతుందని... అలాగే త్వరలోనే అన్ని వివరాల్ని అధికారికంగా వెల్లడిస్తానని నితిన్, భీష్మ పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు వెంకీ కుడుముల. మరి నితిన్ - వెంకీ కుడుముల సినిమా లైన్ ఎలా వుండబోతుందో అనే క్యూరియాసిటీ మాత్రం అందరిలో మొదలైంది.

Venky kudumula Clarity on Bheeshma:

Wait few More Days for Nithiin Film, Says Venky kudumula 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs