ఇంతకాలం మన సినీనటులు వెకేషన్‌కి ఇతర దేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చేవారు. ఖాళీ దొరికితే తమ ఫ్యామిలీ, సహధర్మచారిణి లేదా ప్రియురాళ్లతో కలిసి ప్రేమ పావురాళ్లుగా మారి విదేశాలల్లో వాలేవారు. కానీ ఇటీవల తాజాగా అనుష్కశర్మ, విరాట్‌కోహ్లి పెళ్లి లేదు గిల్లీ లేదు అని చెబుతూ, తమ పెళ్లి వార్తలను ఖండిస్తూనే ఇటలీకి వెళ్లి వివాహం చేసుకున్నారు. ఇక అన్ని అనుకూలించి ఉండి ఉంటే అక్కినేని అఖిల్, శ్రియాభూపాల్‌లు కూడా ఇటలీలోనే ఏకమయ్యేవారు. ఇక నాగచైతన్య, సమంతలు గోవాలో ఒకటైనా మొదట వీరు కూడా ఇటలీ పేరును పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి.
ఇక బాలీవుడ్ విషయానికి వస్తే అనుష్కశర్మ-విరాట్‌కోహ్లి తర్వాత సోనమ్‌కపూర్, శ్రియాశరణ్‌లు కూడా వివాహం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం అందరి చూపు దీపికాపడుకొనే, రణవీర్‌సింగ్ లపై నిలుస్తోంది. వీరి వివాహం కూడా ఖాయమైందని, మాల్దీవులు, శ్రీలంకలో నిశ్చితార్దం కూడా జరిగిందని అన్నారు. తాజాగా బిటౌన్‌లో వినిపిస్తున్న సమాచారం మేరకు రణవీర్‌సింగ్, దీపికాపడుకొనేల వివాహం ఈ ఏడాది నవంబర్ 12 నుంచి 14 వరకు ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ముఖ్యమైన సన్నిహితుల సమక్షంలో జరగనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ ఇద్దరు తమ సన్నిహితులకు ఆహ్వాన పత్రికలు, శుభలేఖలు పంపుతున్నారట.
తాజాగా రణవీర్‌సింగ్ 'పద్మావత్' చిత్రం తర్వాత ప్రస్తుతం తెలుగు 'టెంపర్' రీమేక్ 'సింబా'లో నటిస్తున్నాడు. మరోవైపు దీపికాపడుకోనే 'పద్మావత్' విడుదలై ఆరునెలలైనా కొత్త చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. రణవీర్ అక్టోబర్ కల్లా 'సింబా'ని పూర్తి చేస్తాడు. నవంబర్‌లో వీరి వివాహం జరిగిన తర్వాత నీరజ్ గయవాన్ దర్శకత్వంలో దీపికాపడుకొనే ఓ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రానికి ఓకే చెప్పింది. ఈ చిత్రం వీరి వివాహానంతరం సెట్స్‌పైకి వెళ్లనుంది. వివాహం సన్నిహితుల సమక్షంలో ఇటలీలో సింపుల్‌గా జరిగినా ముంబైలో మాత్రం గ్రాండ్‌గా రిసెప్షన్ పార్టీ ఇవ్వనున్నారట...!