Advertisement
Google Ads BL

హీరోయిన్ కు విచిత్రమైన అనుభవం!


కవులు ఆడవారి అందాలను పలు విధాలుగా వర్ణిస్తూ ఉంటారు. దివి నుంచి భువికి దిగివచ్చిన తారలుగా వర్ణించడం మామూలే. నిన్నటి వరకు అందరు అతిలోక సుందరి అంటే శ్రీదేవి పేరు చెప్పేవారు. కానీ దురదృష్ట వశాత్తు ఆమె హఠ్మారణం చెందింది. ఇక విషయానికి వస్తే ఇప్పుడు దేశవిదేశాలలో ఎంతో డిమాండ్‌ ఉన్న హీరోయిన్లలో దీపికాపడుకొనే ఒకరు. ఈమె ప్రియాంకాచోప్రాతో పోటీపడుతూ, 'పద్మావత్‌'లోనే కాదు... హాలీవుడ్‌లో 'ట్రిపుల్‌ఎక్స్‌'తోపాటు పలు ఆఫర్లను దక్కించుకుంటోంది. 

Advertisement
CJ Advs

తాజాగా ఈమె ఓ మేగజైన్‌కి ఫొటోషూట్‌ చేసింది. ఈ సందర్భంగా ఈమెని విలేకరులు కొన్ని ప్రశ్నలు అడిగి వాటిని మాటలతో కాకుండా చేతలతో సమాధానం ఇవ్వాలని వైట్‌ బోర్డ్‌ని ఆమె చేతికి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీకు ఇష్టమైన జంతువు ఏది? అని అడిగితే 'సింహం. ఎందుకంటే దానికి భయం ఉండదు.. అందుకే ఇష్టం..' అంది. మీకు నచ్చిన ఎమోజీ అంటే నవ్వుతూ ఉన్న ఎమోజీని చూపించింది. మీ కిష్టమైన ఆహారం అంటే 'అన్నం' అంది. 'ఒక వ్యక్తి వచ్చి మీరు ఎక్కడి నుంచి వచ్చారు...?' అని అడిగారు. 'ఇండియా నుంచి వచ్చాను' అని సమాధానం ఇచ్చాను. కానీ ఆయన 'కాదు..కాదు.. మీరు స్వర్గం నుంచి వచ్చారు అన్నాడు...' అదే నాకు ఎదురైన విచిత్ర అనుభవం అని తెలిపింది. 

ఇక తన కిష్టమైన పని.. క్లీనింగ్‌ అని తెలిపింది. మరోవైపు దీపికాపడుకోనే నవంబర్‌ 10 వ తేదీన బాలీవుడ్‌ హీరో రణ్వీర్ సింగ్ ని వివాహం చేసుకోనుందని, స్విట్జర్లాండ్‌ లేదా ఇటలీలో వీరి వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఈ ఇరువురు, వారి సన్నిహితులు, బంధువులు మాత్రం నోరు విప్పడం లేదు. 

This is Deepika Padukone's Best Compliment:

Deepika Padukone Chit chat with Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs