సంక్రాంతికి భారీ బడ్జెట్ మూవీగా విడుదలై అట్టర్ ప్లాప్ అయిన అజ్ఞాతవాసి సినిమాతో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లు విడిపోయారని... అందుకే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి ఎక్కడా కనబడడం లేదని టాక్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో నడిచింది. ఆ సినిమా వలనే మంచి స్నేహితులైన వారి మధ్య అభిప్రాయం బేధాలొచ్చాయని కూడా ప్రచారం జరిగింది. మరి అలా ప్రచారం జరగడానికి అనేక కారణాలు కనిపించాయి కూడా. ఎప్పుడూ ఏ ఫంక్షన్ కి వెళ్లినా పవన్ కళ్యాణ్ తో కంపల్సరీ త్రివిక్రమ్ వెళ్ళేవాడు. ఏ ఈవెంట్ కి వెళ్లనివ్వండి, ఏ మ్యారేజ్ కి వెళ్లనివ్వండి ఎక్కడికైనా ఇద్దరు కలిసికట్టుగా వెళ్లేవారు. అయితే అజ్ఞాతవాసి తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి కనబడితే ఒట్టు.
అందుకే అందరూ పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ కి మధ్య చెడిందనే న్యూస్ స్ప్రెడ్ చేశారు. కానీ త్రివిక్రమ్ ఆ మధ్యలో పవన్ కి తనకి మధ్య బేధాభిప్రాయాలేమి రాలేదని... తామిప్పటికీ ఫోన్ లో మాట్లాడుకుంటున్నామని.. మా ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగిందని.... కానీ అభిప్రాయం బేధాల వలన కాదని.. కేవలం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ కావడం, నేను నా నెక్స్ట్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ లో బిజీగా ఉండడం వలన అని నెత్తి నోరు బాదుకున్నాడు. కానీ త్రివిక్రమ్ ఎంత చెప్పిన గాసిప్ రాయుళ్లు ఊరుకుంటారా.. అయితే తాజాగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ విడిపోలేదని కన్ఫర్మ్ అయ్యింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ హైదరాబాద్ లో కలిసి ఒక ఈవెంట్ కి హాజరయ్యారు.
అది కూడా త్రివిక్రమ్ భార్య సౌజన్య శ్రీనివాస్ భరతనాట్యం ప్రదర్శన కోసం తిరిగి ఇద్దరు కలిసి కనిపించారు. త్రివిక్రమ్ భార్య భరత నాట్యంలో ప్రావిణ్యం సంపాదించి ఆమె హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రాం ఇవ్వడంతో... దానికి త్రివిక్రమ్ తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని ఆహ్వానించగా... పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా తో కలిసి ఈవెంట్ కి హాజరయ్యాడు. మరా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్ ల మధ్య ఉన్న క్లోజ్ నెస్ చూసిన ఎవ్వరైనా వీరి మధ్యన విభేదాలా... నెవర్ అని అనుకోకుండా ఉండరు. మరి తాజాగా వీరు కలిసిన ఈవెంట్ లోని పిక్ ని చూసి ఆనందించండి.