Advertisement
Google Ads BL

మహేష్ లుక్ పై నెగిటివ్ కామెంట్స్..!!


ప్రస్తుతం మహేష్ న్యూ లుక్ తో కొత్తగా వంశి పైడిపల్లి డైరెక్షన్ లో తన 25  మూవీకి శ్రీకారం చుట్టాడు. భరత్ అనే నేను హిట్ తో ఊపుమీదున్న మహేష్ బాబు, వంశి సినిమాతోనూ హిట్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నాడు. తాజాగా రెగ్యులర్ షూటింగ్ కోసం డెహ్రడూన్ వెళ్లిన మహేష్ న్యూ లుక్ కొన్ని లీకెడ్ ఫొటోస్ ద్వారా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అలాగే తన బావ కోసం సమ్మోహనం ఈవెంట్ కి మహేష్ కొత్త లుక్ తోనే వచ్చాడు. అసలప్పుడే మహేష్ న్యూ లుక్ కి మహేష్ అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇక తాజాగా అల్లరి నరేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో మహేష్ లుక్ అదే అని అందరూ ఫిక్స్ అవడమే కాదు... మహేష్ స్టూడెంట్ లుక్ అదే. మహేష్ 25  మూవీ లుక్ అదే అంటున్నారు. ఇక ఈ సినిమాలో కీలక అండ్ మహేష్ ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్న అల్లరి నరేష్ పుట్టినరోజు వేడుకలను డెహ్రాడూన్ లోని ఒక రెస్టారెంట్ లో సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకకి వంశి పైడిపల్లి, పూజ హెగ్డే, అల్లరి నరేష్, మహేష్... స్పెషల్ గెస్ట్ గా అల్లరి నరేష్ కూతురు కూడా వచ్చింది. ఇక నరేష్ కూడా ప్రస్తుతం మహేష్ సినిమా కోసం డెహ్రాడూన్ లోనే ఉండడంతో ... నరేష్ తన పుట్టిన రోజుని అక్కడే యూనిట్ సభ్యుల మధ్యన సెలెబ్రేట్ చేసుకున్నాడు.

Advertisement
CJ Advs

ఇకపోతే మహేష్ అలా చిన్న గెడ్డం, హెయిర్ స్టయిల్ పక్కకి దువ్వుకుని క్యూట్ గానే ఉన్నప్పటికీ... ఇప్పటి వరకు అందరూ మహేష్ రొటీన్ లుక్ కే అలవాటు పడిపోయారు. మరి ఈ సినిమాలో  మహేష్ ఇలా కొత్తగా ట్రై చెయ్యడంతో అసలు ఆ లుక్ వర్కౌట్ అవుతుందా అనే అనుమానం మాత్రం కొందరిలో తలెత్తింది. ఎందుకంటే ఆ న్యూ లుక్ లో మహేష్ కాస్త ఏజ్డ్ పర్సన్ లా కనిపిస్తున్నాడు. ఎందుకో ఆ లుక్ తేడా కొట్టొచ్చు అనే అనుమానము మహేష్ అభిమానుల్లో బయలుదేరిందనే టాక్ వినిపిస్తుంది. మరి బాడీ ఫిట్ గా ఉన్నప్పటికీ మహేష్ అలాంటి షర్ట్ లో అంతగా బాగోలేదని.. కాస్త చూడడానికి ఇబ్బందిగా అనిపిస్తుందని అంటున్నారు. మరి గతంలో మహేష్ బాబు సైనికుడు సినిమాలో రఫ్ గా గెడ్డం పెంచినా.. స్టూడెంట్ లుక్ లో మహేష్ లుక్ సూపర్ గా అనిపించిందని.. ఆ సినిమా పోయినప్పటికీ మహేష్ లుక్ తో అప్పట్లో ట్రెండ్ సెట్ చేశాడని అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ లుక్ ఎక్కువసేపు లేకపోతే బావుండును అనే కామెంట్స్ పడుతున్నాయి.

ఇక వంశి పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు, అశ్విని దత్, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.

Negative comments on Mahesh Babu Look:

Mahesh Babu at Allari Naresh Birthday  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs