Advertisement
Google Ads BL

నాకంటే సమంతే బాగా చేసింది!


సాధారణంగా హీరోయిన్లు తమ పెర్ఫార్మెన్స్ గురించి కాకుండా వేరే హీరోయిన్స్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. ఒకవేళ ఏదైనా ఇంటర్వ్యూలో ఆ తరహా టాపిక్ తెచ్చినా.. చాలా తెలివిగా తప్పించుకొంటుంటారు. కానీ.. మలయాళ కుట్టి అనుపమ మాత్రం సమంత మీద ప్రశంసల వర్షం కురిపించింది. ఈ ఏడాది ఇండస్ట్రీ హిట్ కొట్టిన రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్రకి తొలుత అనుపమ పరమేశ్వరన్ ను తీసుకొన్నారన్న విషయం తెలిసిందే. ఒక ఫోటోషూట్ మరియు కొన్ని సన్నివేశాల ట్రైల్ షూట్ చేశాక.. ఆ పాత్రలోని సహజత్వం కానీ.. పరిపక్వత కానీ అనుపమ మొహంలో కనిపించకపోవడంతో.. ఆమెను తొలగించి ఆమె స్థానంలో సమంతను తీసుకొన్నారు. 

Advertisement
CJ Advs

నిన్న 'తేజ్ ఐ లవ్ యూ' ప్రమోషన్స్ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన అనుపమ పరమేశ్వరన్ ను ఈ విషయమై ప్రశ్నిస్తూ.. 'రామలక్ష్మి క్యారెక్టర్ మిస్ అయినందుకు బాధపడుతున్నారా?' అని అడగ్గా.. మొదట్లో 'నేను చేయాల్సిందా?' అని ఏమీ తెలియనట్లు సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. లాభం లేకపోవడంతో 'నాకంటే సమంత ఆ పాత్రను అద్భుతంగా పోషించింది, ఆమె 101 శాతం న్యాయం చేసింది' అంటూ సమంతను పొగిడేసి తన ఫీలింగ్స్ మాత్రం దాచేసుకొంది. చూడ్డానికి చిన్నపిల్లలా కనిపిస్తుంది కానీ.. అమ్మడు అంత అమాయకురాలేమీ కాదు.

Anupama Parameswaran about Rangasthalam Ramalakshmi Role:

Anupama Parameswaran Praises  Rangasthalam Ramalakshmi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs