Advertisement
Google Ads BL

సమంత ఆ టాటూ రహస్యం చెప్పేసింది!!


గత ఐదేళ్లుగా ప్రేమ పక్షుల్లా విహరించిన నాగ చైతన్య - సమంతల జంట గత ఏడాది అక్టోబర్ లో పెళ్లితో ఒక్కటయ్యారు. ఐదేళ్ల ప్రేమ ఎవ్వరికి తెలియకుండా దాచిపెట్టిన ఈ జంట పెళ్ళికి ముందు ఒక ఏడాది ముందే వారి ప్రేమ గురించి అందరికి తెలియడం... ఇక వారి మీద మీడియా నిఘా పెట్టడం జరిగింది. అయితే పెళ్ళికి ముందే సమంత, నాగ చైతన్య చేతుల మణి కట్టుల మీద టాటూలు వేయించుకున్నారు. ఇద్దరి చేతులకి ఒకే టాటూ ఉండడంతో.. అప్పటికే వారి ప్రేమ గురించిన విషయాలు ఒక్కొక్కటిగా తెలియడం... ఇక ఈ టాటూలతో వారి మధ్యన ప్రేమ ఉందని ఫిక్స్ అవడం జరిగింది. అయితే అసలు ఇద్దరు ఒకే టాటూలు ఎందుకు వేయించుకున్నారన్న సస్పెన్సు నిన్నటి వరకు నడిచింది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా ఆ టాటూలు వారి చేతుల మీద ఎందుకు వేయించుకున్నది చెప్పేసింది సమంత. సమంత తాజాగా నటిస్తున్న యూటర్న్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన సమంత తన చేతి మీద, చైతు చేతి మీదున్న టాటూ సీక్రెట్ గురించి చెప్పేసింది. ఆ టాటూ తనకు, తన భర్తకు గుర్తుగా వేయించుకున్నదని..... ఆ టాటూ అంటే మేమిద్దరం అని, రియాలిటీలో ఉందామన్న అర్థం ఈ టాటూ వెనకుందని చెప్పింది. అలాగే ఆన్ స్క్రీన్ మీద తామిద్దరం ఆర్టిస్టులం కాబట్టి..... ఆఫ్ స్క్రీన్ లో రియాలిటీలో బతకాలన్నది తమ ఆలోచనని తెలిపింది. అందుకే ఇద్దరం ఈ టాటూ వేయించుకున్నామని.... ఇదే విధమైన టాటూ చైతూ చెయ్యిపైనా ఉందని సమంత చెప్పుకొచ్చింది.

మరి సమంత చెప్పింది ముమ్మాటికీ నిజమే. ఒకే ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఒకరి భావాలను, ఒకరు అర్ధం చేసుకోవడం అనేది ఎంతో అవసరం. అందుకే వారి రీల్ లైఫ్ లో నటించినట్టుగా... రియల్ లైఫ్ లో నటించకూడదని అనుకోవడం శుభపరిణామమే. ఇక సమంత పెళ్లయ్యాక.. మూడు సినిమాల హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టగా.... తాను నటించిన యు -టర్న్ త్వరలోనే విడుదల కాబోతుంది. ఇక చైతు సవ్యసాచి విడుదలకు సిద్ధమవుతుండగా... శైలజ రెడ్డి అల్లుడు షూటింగ్ జరుపుకుంటుంది. ఇక నాగ చైతన్య - సమంత లు కలిసి పెళ్లి తర్వాత శివ నిర్వాణం డైరెక్షన్ లో ఓ సినిమా చెయ్యబోతున్నారు.

Samantha Tattoo Secrets Revealed:

Samantha And Naga Chaitanya Reveal The Secret Behind Their Couple Tattoo  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs