టాలీవుడ్‌లో కాస్టింగ్‌కౌచ్‌పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇదే సమయంలో గతంలో యమున, జ్యోతి, సుకన్య, భువనేశ్వరి వంటి వారిపై వ్యభిచారం కేసులు నమోదైన విషయం తెలిసిందే. శ్రీరెడ్డి, అపూర్వవంటి వారు దీనిపై గళమెత్తుతున్నారు. ఇదే సమయంలో ఏకంగా అమెరికా కేంద్రంగా టాలీవుడ్ సెలబ్రిటీల సెక్స్‌రాకెట్ బయటపడింది. ఈ సమయంలో కాస్టింగ్‌కౌచ్‌లేదని ఎవ్వరు అనలేరు. కాకపోతే అలాచేసే కొందరి వల్ల అందరికీ చెడ్డ పేరు రావడం మాత్రం బాధాకరం. అలాగని నటీమణులు లొంగకుండా ఉంటే అసలు ఈ వ్యవహారమే ఉండదు కదా... ! అనే వాదన కూడా తెరపైకి వస్తోంది.
ఇక విషయానికి వస్తే 30ఇయర్స్ ఇండస్ట్రీ అనే సినీ పరిశ్రమపై వేసిన సెటైర్‌తోనే పాపులర్ అయిన కమెడియన్ పృధ్వీ మాత్రం టాలీవుడ్‌లో కాస్టింగ్‌కౌచేలేదని వన్‌సైడ్‌గా మాట్లాడటం విడ్దూరంగా ఉంది. ఎక్కడైనా నిప్పులేనిదే పొగరాదు. కాస్టింగ్‌కౌచ్ గురించి ఆరోపణలు చేస్తోంది బయటి వారు, మీడియా మాత్రమే కాదు. వీరందరు సినీ పరిశ్రమతో సంబంధం ఉండేవారే. ఇక ఏకంగా ఇండస్ట్రీలో 30ఏళ్ల అనుభవం ఉన్న పృథ్వీ అసలు కాస్టింగ్‌కౌచే లేదంటున్నాడు. ఏ సినిమాలో అయినా సినిమాకి, హీరోకి తగ్గ హీరోయిన్ కోసం నిర్మాతలు చూస్తారే గానీ ఎవరిని పడితే వారిని పెట్టుకోరు అంటున్నాడు.
ఉదాహరణకు 'మల్లీశ్వరి' చిత్రంలో కత్రినాకైఫ్ అయితేనే బాగుంటుందని, అలాంటి పాత్రలకు సరిపడే హీరోయిన్లు మన వారిలో ఎవరు ఉన్నారు? అంటూ ఆయన ప్రశ్నిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం వరకు టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లే ఉండేవారని,ఆమని నుంచి దివ్యవాణి వరకు ఈ ట్రెండ్ కొనసాగింది. ఇప్పుడున్న అమ్మాయిలలో టాప్ స్టార్స్‌కి సరిపడే తెలుగు హీరోయిన్లు ఎవరు ఉన్నారో చూపించండి? కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇండస్ట్రీ పరువు పోయేలా ప్రవర్తిస్తున్నారు. ఆమధ్య ఓ నటి ఓ నిర్మాత మీద తీవ్ర ఆరోపణలు చేసింది. మరి ఆయన అలాంటి వాడని తెలిసి కూడా ఆమె ఆ నిర్మాత గెస్ట్‌హౌస్‌కి ఎందుకు వెళ్లింది? ఇలా ఆరోపణలు చేసే వారి వల్ల నటీమణులకు అద్దె ఇళ్లు కూడా దొరకడం లేదు.
నటీమణుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు ఇండస్ట్రీలో లేరు. కొందరు చేస్తున్న వ్యాఖ్యల వల్లనే సినిమా ఇండస్ట్రీ అంటే చులకన భావం ఏర్పడిందని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశాడు. పృథ్వీ చేసిన వ్యాఖ్యల్లో ఒక కోణంలో ఆయన మాటలు నిజమేననిపిస్తున్నా.. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. ఏకంగా అమెరికా పోలీసులు చేస్తున్న ఆరోపణలల్లో కూడా నిజంలేదా? ఇంకా చెప్పాలంటే పృథ్వీ భార్య కూడా ఆయనపై పలు విమర్శలు చేసి పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కింది? వాస్తవం కాదా? అనేది పృథ్వేకే తెలియాలి.