Advertisement
Google Ads BL

అల్లరోడు.. 'రవి' అని రివీల్ చేశారు..!


అల్లరి నరేష్ ప్రస్తుతం వరస ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. అస్సలు కొంత కాలం నుండి ఈ కామెడీ హీరోకి హిట్ అనే పదమే దూరమయ్యింది.  రొటీన్ కామెడీతో అల్లరి నరేష్ హీరోగా హిట్స్ కొట్టలేక సతమతమవుతున్న టైం లో మహేష్ బాబు సినిమాలో ఒక కీలక పాత్ర చెయ్యడానికి ఒప్పుకుని కొత్తగా ట్రై చేస్తున్నాడు. మహేష్ - వంశి పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న మహేష్ 25 వ సినిమాలో అల్లరి నరేష్, మహేష్ కి స్నేహితుడిగా నటిస్తున్నాడు. ఇక మహేష్ సినిమాతో అయినా అల్లరి నరేష్ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అందరూ ఆశిస్తున్నారు. ఇక తాజాగా శనివారం అల్లరినరేష్ పుట్టిన రోజు జరుపుకున్నాడు.. అల్లరి పుట్టిన రోజుకి టాలీవుడ్ లోను చాలామంది ఆయన సన్నిహితులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
CJ Advs

అయితే మహేష్ బాబు - వంశి సినిమాలో అల్లరి నరేష్ పాత్ర పేరు రవి అని ఆ సినిమా దర్శకుడు వంశి కాస్త క్లూ ఇచ్చేసాడు. అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా వంశి పైడిపల్లి అతనికి బర్త్ డే విషెస్ చెబుతూ... మా రవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీతో పనిచేయడం గొప్ప అనుభూతినిస్తోంది. మహేష్ 25వ మూవీ నీకు మరింత మంచి భవిష్యత్తునిస్తుందని ఆశిస్తున్నాం... అంటూ ట్వీట్ చెయ్యడంతో.. మహేష్ సినిమాలో అల్లరి పాత్ర పేరు రవి అని మహేష్ ఫాన్స్ తో పాటుగా ఫిలింసర్కిల్స్ అంతా ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే అల్లరి నరేష్.. మహేష్ ఫ్రెండ్ గా నటిస్తున్నాడని... అనుకోకుండా అల్లరి పాత్ర ఈ సినిమాలో చనిపోవడంతో.. మహేష్ ఆ హత్యకి గల కారణాలు వెతుకుతాడనే న్యూస్ ప్రచారంలో ఉంది.

ఇక తాజాగా వంశి పైడిపల్లి ఇచ్చిన రవి అనే క్లూతో అందరూ అల్లరి పేరు రవి అని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాతో వంశి చెప్పినట్లుగా అల్లరి కెరీర్ టర్న్ అయ్యి మళ్ళీ నిలదొక్కుకుంటాడేమో చూడాలి. ప్రస్తుతం వంశి పైడిపల్లి దర్శకత్వంలో ఒక నెల లేట్ గా మహేష్ సినిమా డెహ్రాడూన్ లో మొదలై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పూజ హెగ్డే మొదటిసారి మహేష్ తో జోడి కడుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతమందిస్తున్నాడు.

Allari Naresh Role Revealed in Mahesh Babu's 25th Film:

Vamsi Paidipally Revealed Allari Naresh Name in Mahesh 25th Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs