Advertisement
Google Ads BL

బాలయ్యను వాడేస్తున్నాడుగా..!


ప్రస్తుతం తరానికి చెందిన నవతరం హీరోలలో హడావుడి లేకుండా సైలెంట్‌గా దూసుకెళ్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు మెల్లమెల్లగా దగ్గరవుతున్న హీరో నాగశౌర్య. తాజాగా ఆయనకు 'ఛలో'వంటి మంచి హిట్‌ వచ్చింది. ఈ చిత్రాన్ని ఆయనే స్వయంగా నిర్మించాడు. మరోవైపు ఆయన మరో రెండు చిత్రాలను ఓకే చేశాడు. ఇందులో ఓ చిత్రాన్ని నాగశౌర్య స్వయంగా నిర్మిస్తుండగా మరో చిత్రాన్ని భవ్య ఆర్ట్స్‌ వంటి పెద్ద బేనర్‌ నిర్మిస్తోంది. నాగశౌర్య హీరోగా, నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రానికి 'నర్తనశాల' అనే టైటిల్‌ని పెట్టారు. ఇదే టైటిల్‌తో స్వర్గీయ ఎన్టీఆర్‌ చిత్రం ఒకటి వచ్చింది. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత ఎంతో కాలానికి బాలయ్య మెగాఫోన్‌ చేతబట్టుకుని శ్రీహరి, శ్రీకాంత్‌, ఉదయ్‌కిరణ్‌ వంటి పలువురితో సొంతగా 'నర్తనశాల' చిత్రం స్టార్ట్‌ చేశాడు. కానీ ద్రౌపతిగా నటించాల్సిన సౌందర్య హఠాత్తుగా మరణంతో ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. అదే టైటిల్‌ను ఇప్పుడు నాగశౌర్య తన చిత్రానికి పెట్టుకున్నాడు. మరోవైపు త్వరలోనే భవ్య ఆర్ట్స్‌ బేనర్‌లో నాగశౌర్య నటించే చిత్రం కూడా స్పీడు పెంచుతోంది. ఇందులో నాగశౌర్య ఇద్దరు హీరోయిన్ల మధ్య లవర్‌బాయ్ వంటి శ్రీకృష్ణుని టైప్‌లో చిలిపిగా ఉంటాడని, అందుకే ఈ చిత్రానికి బాలకృష్ణ, శోభన, నిరోషా కలిసి నటించిన 'నారీ నారీ నడుమ మురారి' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేయనున్నారని సమాచారం. 

ఇక నాగశౌర్య సరసన నటించే హీరోయిన్లను ఎంపిక చేయాల్సివుంది. ఈ చిత్రంతో నాగశౌర్యకి యూత్‌లో, లేడీస్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరవుతాడని అంటున్నారు. ఈ మూవీ షూటింగ్‌ ఆగష్టులో మొదలుకానుంది. కాగా గతంలో బాలయ్య చేసిన 'నారీ నారీ నడుమ మురారి' చిత్రానికి కోదండరామిరెడ్డి దర్శకుడు కాగా కాట్రగడ్డ మురారి నిర్మించాడు. 

Nari Nari Naduma Murari Title for Naga Shourya Next:

Naga Shourya New Film Title confirmed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs