Advertisement
Google Ads BL

తేజ్ కి కూడా శుభాకాంక్షలు తెలిపాడు!


టాలీవుడ్‌లో ఇతర హీరోలతో సమానంగా మెగాహీరోల సంఖ్య ఉంది. ఇక తమ ఫ్యామిలీ కాంపౌండ్‌ నుంచి ఎవరు నటించిన చిత్రం విడుదల అవుతుందన్నా,ఆడియో నుంచి ప్రీ రిలీజ్, సక్సెస్‌మీట్‌ వరకు, ఫస్ట్‌లుక్‌ నుంచి ట్రైలర్‌ వరకు మెగాహీరోలు బాగా ప్రమోషన్‌ చేస్తారు. ఎంత బిజీలో ఉన్నా ఈ విషయంలో వారు అలక్ష్యం చేయరు. ఏదో పవన్‌, నాగబాబులు మాత్రం తమ పనిలో ఉండిపోయినా మిగిలిన అందరు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా జూలై 6వ తేదీన మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ నటించిన 'తేజ్‌ ఐ లవ్యూ', మెగాస్టార్‌ చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్‌లు ఒక వారం రోజుల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే 'విజేత' ట్రైలర్‌ గురించి గొప్పగా చెప్పిన రామ్‌చరణ్‌ తాజాగా విడుదలైన 'తేజ్‌ ఐ లవ్‌యు' చిత్రం ట్రైలర్‌పై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. ట్రైలర్‌ చూశాను. ఎంతో నచ్చింది. విజువల్స్‌, మ్యూజిక్‌కి థ్రిల్‌ అయ్యాను. కరుణాకరన్‌ నుంచి వస్తోన్నమరో నమ్మకమైన చిత్రంలా ఉంది. ఇంత మంచి ఫీల్‌గుడ్‌ మూవీని అందిస్తున్న కరుణాకరన్‌, నిర్మాత కె.యస్‌.రామారావు, మొత్తం యూనిట్‌కి బెస్టాఫ్‌ లక్‌ చెప్పాడు. 

ఇక ఇలా మెగాకాంపౌండ్‌ హీరోలే అతితక్కువ గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు రావడం ఇదే ఏడాది ఇది రెండోసారి. వరుణ్‌తేజ్‌ 'తొలిప్రేమ', సాయిధరమ్‌తేజ్‌ 'ఇంటెలిజెంట్‌' చిత్రాలు ఇలా తక్కువ గ్యాప్‌లో రావడం, తేజు చిత్రం డిజాస్టర్‌గా నిలవడం తెలిసిందే. మరి వరున్‌తేజ్‌తో పోటీ పడి దెబ్బతిన్న తేజు ఈసారి 'తేజ్‌ ఐ లవ్‌యు'తో హిట్‌ కొడతాడా? విజేత, తేజ్‌ ఐ లవ్‌యులో ఏది విజయం సాధిస్తుందో వేచిచూడాల్సివుంది. 

Ram Charan comments on Tej I Love You Trailer:

Ram Charan Praises Tej I Love You Trailer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs