Advertisement
Google Ads BL

వైఎస్సాఆర్ యాత్రలో రంగమ్మత్త పాత్రేంటో..?


తెలుగు యాంకరింగ్ ప్రపంచంలో.. యాంకర్ అర్ధాన్నే మార్చేసిన భామ అనసూయ. పెళ్లయిన ఏళ్ళు గడుస్తున్నా ఇసుమంతైనా తరగని అందంతో.. హాట్ హాట్ డ్రెస్సులతో.. యాంకర్ అంటే అనసూయ అనేలా చేసింది. అందానికి అందం, హాట్ నెస్ కి హాట్ నెస్... అలాగే వాక్చాతుర్యానికి వాక్చాతుర్యం. ఇలా సకల కళా లేడీగా అనసూయకి పేరుంది. మరి తాజాగా వెండితెర రాణిగా కూడా వెలుగొందుతుంది. ఒకే ఒక్క సినిమా అనసూయ ఫెట్ మార్చేసింది. అది క్షణం సినిమా కాదు. రంగస్థలం సినిమా. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో అనసూయ తన లక్కు ని పెంచుకుంది. ఆ పాత్రతో అనసూయ ప్రస్తుతం అనేక సినిమాల్లో బిజీ అయ్యింది.

Advertisement
CJ Advs

అనిల్ రావిపూడి ఎఫ్ 2 ... ఫన్ అండ్ ఫ్రస్టేషన్ లో కీలక పాత్ర కొట్టేసిన అనసూయ తాజాగా మరో క్రేజీ చిత్రంలో అద్భుతమైన పాత్ర దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. అది కూడా వైఎస్ఆర్ బయోపిక్‌పై రానున్న యాత్ర సినిమాలో అనసూయ కీలక పాత్ర కాదండోయ్.. ఏకంగా పొలిటికల్ లీడర్ పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యిందట. వైఎస్ బయోపిక్ లో అనసూయ కర్నూలు జిల్లాలో పాపులర్ ఉమెన్ లీడర్‌గా కనిపించనున్నట్లు టాక్. ఈ పొలిటికల్ పాత్రతో మరోసారి అనసూయ పాపులర్ కావడం ఖాయమంటున్నారు. 

మహి వి రాఘవ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాత్ర సినిమాలో మలయాళ నటుడు మమ్ముట్టి వైఎస్సాఆర్ పాత్రలో కనిపిస్తుండగా.. వైఎస్ భార్య విజయమ్మ పాత్రలో బాహుబలి ఫేమ్ ఆశ్రిత వేముగంటి నటిస్తుంది. అయితే మమ్ముట్టి పక్కనుండే పాత్రలో అనసూయ కనబడుతుందని చెబుతుండగా... అనసూయ క్యారెక్టర్  ఈ సినిమాలో అత్యంత కీలకమని.. అందుకే ఈ పాత్ర చెయ్యడానికి అనసూయ వెంటనే ఒప్పుకుందని అంటున్నారు. మరి రంగస్థలం సినిమా అనసూయకి టర్నింగ్  పాయింట్ కాగా.. ఈ యాత్ర సినిమాతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చెయ్యడం ఖాయమంటున్నారు.

Anasuya in YSR Biopic Yatra:

Anasuya Bharadwaj turns politician for Mammootty's YSR biopic 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs