Advertisement
Google Ads BL

మహేష్ ఏ విషయంలోనూ తగ్గట్లేదుగా!!


టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇప్పుడు తమ బాడీ షేప్ ని మార్చేస్తున్నారు. జై లవ కుశ లో బాగా లావుగా కనబడిన ఎన్టీఆర్ అరవింద సమేత కోసం దాదాపుగా మూడు నెలల పాటు బాలీవుడ్ ట్రైనర్ ఆధ్వర్యంలో జిమ్ లో కష్టపడి కండలు కరిగిస్తున్నాడు అనుకుంటే.. అరవింద సమేత ఫస్ట్ లుక్ లో సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొట్టాడు. ఇక అప్పట్లో ఎన్టీఆర్ జిమ్ లో చేసిన వర్కౌట్స్ వీడియోస్ అన్ని ఇంటర్నెట్ లో హల్చల్ చేశాయి. ఇక రంగస్థలం సినిమాకి పల్లెటూరి చిట్టి బాబు గెటప్ కోసం రామ్ చరణ్ బాడీ ని కండలు పెంచి రఫ్ గా తయారు చేసాడు. ఇక అచ్చం పల్లెటూరి మొరటోడు గెటప్లో రామ్ చరణ్ లుక్ సూపర్. అయితే బోయపాటి తో సినిమా కోసం ఆ కండలు కరిగించే పని పెట్టుకున్నాడు రామ్ చరణ్. బోయపాటి సినిమాలో రామ్ చరణ్ మంచి బాడీ షేప్ తో ఉంటాడని అతడి ప్రస్తుత లుక్ తెలియజేస్తుంది.

Advertisement
CJ Advs

ఇక బాహుబలితో ప్రభాస్ పెంచిన కండలు.. గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి మహారాజు గెటప్ లో ప్రభాస్ మంచి బాడీ లాంగ్వేజ్ తో అదరగొట్టాడు. ఇక సాహో కోసం కొద్దిగా బాహుబలి కండలను అమెరికా ట్రైనర్ సహాయంతో కరిగించి సిద్దమయ్యాడు. అలాగే అల్లు అర్జున్ ఎప్పుడూ ఫిట్ గా ఉండడానికి తెగ ట్రై చేస్తాడు. నా పేరు సూర్య లో ఆర్మీ ఆఫీసర్ లుక్ కోసం అల్లు అర్జున్ బాలీవుడ్ ట్రైనర్ ని తెచ్చుకున్నాడు. ఇక తాజాగా ఈ లిస్ట్ లోకి మహేష్ బాబు వచ్చి చేరాడు. మహేష్ బాబు - వంశి పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న మహేష్ 25 మూవీ కోసం లుక్ తో పాటుగా బాడీ షేప్ ని కూడా మార్చేస్తున్నాడు. 

ఆ సినిమాలో స్టూడెంట్ లుక్ లో మహేష్ పర్ఫెక్ట్ ఫిట్నెస్ కోసం ట్రై చేస్తున్నాడట. ఇప్పటికే తన టోటల్ లుక్ మార్చేసిన మహేష్ ఫిట్నెస్ విషయంలోనూ సీరియస్ గా వున్నాడట. ఇప్పటికే మహేష్ తన ఫిటెనెస్ ని మొదలు పెట్టేసాడని... అవుట్ డోర్ లొకేషన్స్ లో కూడ ట్రైనర్ తో పనిచేస్తూ త్వరలోనే ఫుల్ ఫిట్ గా కనిపించడానికి ట్రై చేస్తున్నాడట. ఫిట్నెస్ ట్రైనర్ తో ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు మహేష్. మరి మహేష్ ఫుల్ ఫిట్నెస్ తో స్టూడెంట్ లా తన 25 వ మూవీలో ఎలా అదరగొడతాడో వెయిట్ అండ్ సీ.

Mahesh Babu Hires Fitness Trainer:

<h1><span style="font-weight: normal;">Mahesh Follows Charan, Bunny, NTR</span></h1>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs