Advertisement
Google Ads BL

రమాప్రభ అనుభవంతో చెప్పిన మాటలివి..!


రత్తాలు వస్తావా.. అడిగింది ఇస్తావా? అంటూ తన ఆటపాటలతో, నటనతో గిలిగింతలు పెట్టి మూడుతరాల నటులతో కలిసి నటించిన సీనియర్‌ నటి రమాప్రభ. 55ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఆమె 1500లకి పైగా చిత్రాలు చేశారు. సహనటుడు శరత్‌కుమార్‌ని వివాహం చేసుకుని మోసపోయారు. ఇప్పుడు ఈమె సినిమా, నటనకు దూరంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉంటోంది. ఆమె కంటూ ఎక్కడా ఆస్తులు లేవు. అన్నింటిని కొందరు నమ్మిన వారు మోసం చేశారు. దాంతో ఆమె చివరి రోజులను తనకిష్టమైన సాయిబాబు సేవలో తరించాలని భావిస్తోంది. మానసికంగా, ఆర్ధికంగా చాలా ఇబ్బందులు వచ్చాయి. 

Advertisement
CJ Advs

అనుకోకుండా పూరీ జగన్నాథ్‌ ఆమెని గోపీచంద్‌ 'ఆరడగుల బుల్లెట్‌' షూటింగ్‌లో కలిసి ఆమె పుట్టినరోజు, సెల్‌నెంబర్‌ తీసుకున్నాడు. ప్రతి నెలా ఆమె అడగకుండానే నెలకి 20వేలు 5వ తేదీలోపు ఆమెకి పంపిస్తున్నాడు. ఏయన్నార్‌ మరణం ఆమెని కృంగదీసింది. వాణిశ్రీ ఫోన్‌ చేసి చెబితే ఈమెకి విషయం తెలిసింది. కానీ కొందరు ఆమెని ఆయన శవాన్ని చూడటాన్ని అడ్డుకోవాలని చూశారు. ఈమె ఎస్వీరంగారావును డాడీ అని పిలిచేది. రాజబాబుని తమ్ముడిలా చూసుకుంటూ ఒరేయ్‌ అని పిలిచేది. ఆయనతో 300 చిత్రాలలో కలిసి నటించింది. ఆయన మరణం ఆమెని తీవ్రంగా బాధించిది. 

ఇక ఈమె జయలలిత, సావిత్రిలకు కూడా చాలా క్లోజ్‌. మహానటి సినిమాని సావిత్రితో పరిచయం ఉన్న వారినుంచి విషయాలు సేకరించకుండా ఎలా తీస్తారు? మహానటి సినిమా డబ్బుల కోసమే తీశారు అంటోంది. అందుకే ఆ చిత్రాన్ని చూడలేదు. సూపర్‌స్టార్‌ కృష్ణ నిజజీవితంలో కూడా సూపర్‌స్టారే. ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకునేవారు. సావిత్రి మహా మొండిమనిషి, హిందీనటుడు ప్రాణ్‌ వేలం వేసిన గంధపు మాలను పాటపడి మైలాపూర్‌లోని ఇంటిని రాసిచ్చింది. ప్రస్తుతం నేను సాయిబాబా సేవలోనే ఆనందాన్ని పొందుతున్నానని, వీలునప్పుడల్లా షిర్డీ వెళ్లి వస్తుంటానని పలు విషయాలు చెప్పుకొచ్చింది.

Rama Prabha Revealed A Shocking secret About Savitri:

Actress Rama Prabha Exclusive Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs