Advertisement
Google Ads BL

ఏఎన్నార్ గా ఈసారి చైతూ కాదు..!


అక్కినేని వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగ చైతన్య, అఖిల్, సుమంత్, శుశాంత్ లు హీరోలుగా నిలబడడానికి కష్టపడుతున్నారు. మీడియం బడ్జెట్ హీరోగా నాగ చైతన్య  ఫిక్స్ అయ్యాడు. ఇంకా అఖిల్, సుమంత్, సుశాంత్ లు సెటిల్ అవ్వాల్సి ఉంది. సుమంత్ కూడా చాలా ఏళ్ళకి మళ్ళీ రావా సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం సుమంత్ ఇదం జగత్ సినిమా చేస్తున్నాడు. రెండు రోజుల క్రితమే విడుదలైన ఇదం జగత్ ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. ఇకపోతే మహానటి సినిమాలో నాగ చైతన్య తన తాతగారు ఏఎన్నార్ పాత్రలో గెస్ట్ రోల్ చేశాడు. అయితే ఆ పాత్రకి పెద్దగా పేరు రాకపోయినా తన తాతగారి పాత్ర చేసినందుకు హ్యాపీ ఫీల్ అయ్యాడు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో నాగ చైతన్య మరోమారు ఏఎన్నార్ పాత్ర చేస్తున్నట్టుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు క్రిష్... నాగ చైతన్య ని సంప్రదించినట్లుగా వార్తలొచ్చాయి. అయితే తాను ఈ పాత్ర చెయ్యలేనన్ని నాగ చైతన్య క్రిష్ కి చెప్పినట్లుగా.. తనకొచ్చిన ఆ అద్భుతమైన పాత్రని సున్నితంగా తిరస్కరించినట్లుగా తెలుస్తుంది. అయితే పట్టువదలని క్రిష్, ఎన్టీఆర్ బయో పిక్ లో ఏఎన్నార్ వారసులెవరైనా ఉంటేనే బావుంటుందని.. ఏఎన్నార్ పాత్రకి నాగేశ్వర రావు కూతురు కొడుకు సుమంత్ ని సెలెక్ట్ చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి.

మరి నాగేశ్వర రావు గారి పాత్రలో ఆయన ఇష్టమైన సుమంత్ చెయ్యడం అనేది బావుంటుంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ పాత్రకి నాగ చైతన్య రిజెక్ట్ చేసినట్లుగానే.. ఎన్టీఆర్ బృందం సుమంత్ ని సంప్రదించినట్టుగాని అధికారిక సమాచారం లేదు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్రకి రానా, కృష్ణ పాత్రకి మహేష్ అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఏది నిజమనేది ఎన్టీఆర్ టీమ్ క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది.

Sumanth To Play ANR In NTR Biopic:

Naga Chaitanya Rejected For NTR    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs