Advertisement
Google Ads BL

రేణుదేశాయ్‌ సెటైర్‌ అదిరింది...!


పవన్‌కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ పవన్‌తో మొదట సహజీవనం చేసింది. కానీ ఈ సారి మాత్రం తాను సహజీవనం చేయదలుచుకోలేదని, అందుకే తన సన్నిహితులు కుదిర్చిన వివాహాన్ని సంప్రదాయ బద్దంగా చేసుకుంటున్నానని తెలిపింది. ఈ విషయం తెలిసిన చాలా మంది రేణుదేశాయ్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఆమె మంచి నిర్ణయం తీసుకుందని, తనకు తోడును చూసుకుందని, ఆమె జీవితం హ్యాపీగా కొనసాగాలని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కానీ పవన్‌ అభిమానుల్లో కొందరు పవన్‌కి చెడ్డపేరు తేవద్దని, ఆయనపై కోపం ఉన్నా సరే ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచిస్తుంటే మరికొందరు మాత్రం ట్విట్టర్‌ వేదికగా ఆమెకి హెచ్చరికలు చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇక ఇటీవల పవన్‌, రేణుదేశాయ్‌ల కుమారుడు అకీరానందన్‌ తన తండ్రి విజయవాడలో అద్దె ఇంటిలో గృహప్రవేశం చేసిన సందర్భంగా పవన్‌తో కనిపించాడు. దాంతో అకీరా హైదరాబాద్‌కి తన తండ్రి వద్దకు షిఫ్ట్‌ అయ్యాడని, తన తల్లి పెళ్లి విషయలో అకీరానందన్‌ ఎంతో అప్‌సెట్‌ అయ్యాడని కొందరు వార్తలు సృష్టిస్తూ వైరల్‌ చేస్తున్నారు. కాగా ఈ విషయంపై రేణుదేశాయ్‌ ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నా పెళ్లి విషయం తెలిసి అకీరా అప్‌సెట్‌ అయ్యాడని అంటున్నారు. నిజమే అకీరా బాగా హర్ట్‌ అయ్యాడు. అయితే అది నా పెళ్లి గురించి కాదు. మెనూలో పన్నీర్‌ బటర్‌ మసాలా లేదని అకీరా అప్‌సెట్‌ అయ్యాడంటూ సెటైరికల్‌గా ఈ గాసిప్స్‌కి కౌంటర్‌ ఇచ్చింది. 

ఇక ఈ విషయమై దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ, పవన్‌, రేణుదేశాయ్‌లు చట్టపరంగా విడాకులు తీసుకున్నారు. రేణుదేశాయ్‌కి మరో పెళ్లి చేసుకునే హక్కు ఉంది. దీనిని ఎవరు కాదనలేరు. పవన్‌ కూడా స్వేచ్చకి విలువనిచ్చే మంచి మనిషి. ఆయనకు చెడ్డపేరు తెచ్చే విధంగా ఆయన అభిమానులు ప్రవర్తించవద్దని కోరింది. 

Renu Desai Satire on Pawan Kalyan Fans:

Renu Desai Serious on Pawan Kalyan fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs