అక్కినేని అఖిల్ మొదటి చిత్రం 'అఖిల్' డిజాస్టర్ కావడంతో తన రెండో చిత్రానికి ఎంతో గ్యాప్ తీసుకుని 'హలో' చిత్రం చేశాడు. మొదటిది డిజాస్టర్ కాగా, రెండో చిత్రం యావరేజ్‌తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత కూడా ఆయన తన మూడో చిత్రానికి బాగానే గ్యాప్ తీసుకుని, యంగ్‌డైరెక్టర్, మొదటి చిత్రం 'తొలిప్రేమ'తోనే టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరితో చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తుండగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ చిత్రం కూడా 'తొలిప్రేమ'లానే లండన్‌లో ఎక్కువ భాగం షూటింగ్‌ను జరుపుకోనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇలా తన మూడు చిత్రాల విషయంలో సినిమా సినిమాకి గ్యాప్ తీసుకున్న అఖిల్ తన నాలుగవ చిత్రాన్ని మాత్రం గ్యాప్‌లేకుండా వెంటనే కథను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా రచయిత గోపీమోహన్ అఖిల్‌కి చెప్పిన కథ బాగా నచ్చడంతో అదే కథను లాక్ చేశాడట. అయితే ఈ చిత్రానికి కథతోపాటు దర్శకత్వం కూడా గోపీమోహనే చేస్తాడా? లేదా గోపీమోహన్ కథతో మరో దర్శకుని డైరెక్షన్‌లో దీనిని చేస్తాడా? అనేది మాత్రం సస్పెన్స్‌గా ఉంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుంది.