Advertisement
Google Ads BL

రజనీ కూడా చెప్పుడు మాటలు వింటాడా..!!


దక్షిణాదిలో గౌతమ్‌ వాసుదేవ మీనన్‌కి క్రియేటివ్‌ దర్శకునిగా మంచి గుర్తింపు ఉంది. కానీ అదేం విచిత్రమో గానీ నిజజీవితంలో ఎంతో హుందాగా, కరెక్ట్‌గా ఉండే హీరో సూర్యతో ఆయనకు విబేధాలు వచ్చాయి. తాజాగా గౌతమ్‌మీనన్‌ తనకి రజనీకాంత్‌ నుంచి కూడా అవమానం ఎదురైందని చెప్పుకొచ్చాడు. ఇక విషయానికి వస్తే గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో ప్రస్తుతం విక్రమ్‌ హీరోగా 'ధృవనక్షత్రం' చిత్రం రూపొందుతోంది. త్వరలో ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. దేశరక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టే ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్స్‌ కథతో ఇది రూపొందింది. 

Advertisement
CJ Advs

మొదట ఈచిత్రం చేయడానికి ఓకే చెప్పిన సూర్య కథ నచ్చినా కూడా గౌతమ్‌తో బేధాభిప్రాయాలు వచ్చి వైదొలగాడు. ఆ తర్వాత గౌతమ్‌మీనన్‌ ఇదే కథను సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి కూడా చెప్పాడట. కథ మొత్తం ఎంతో ఇంట్రస్టింగ్‌గా విన్న రజనీ కూడా కథ చాలా బాగుంది అంటూ డేట్స్‌, బడ్జెట్‌ వంటి విషయాల గురించి కూడా గౌతమ్‌తో మాట్లాడి, ఈ చిత్రం చేస్తానని చెప్పాడని, కానీ కొందరు తన గురించి రజనీకి తప్పుగా చెప్పడంతో రజనీ ఈ చిత్రం చేయకుండా డ్రాప్‌ అయ్యాడని గౌతమ్‌మీనన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. 

సూర్య, రజనీకాంత్‌లకు నిజాయితీ పరులుగా, మాట మీద నిలబడే వ్యక్తులుగా, ఎవరితో శత్రుత్వం పెట్టుకోని అజాత శత్రువులుగా పేరుంది. అలాంటి ఈ ఇద్దరు స్టార్స్‌ గౌతమ్‌మీనన్‌తో వచ్చిన స్పర్ధల కారణంగా ఈ చిత్రం నుంచి డ్రాప్‌ కావడం చూస్తుంటే ఇందులో గౌతమ్‌మీనన్‌ తప్పుకూడా ఏదో ఉండే ఉంటుందని, లేకుండా ఏకంగా ఈ ఇద్దరు ఎందుకు తప్పుకుంటారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 

Gautam Menon Rues Rajinikanth's Rejection:

Director Blames Superstar’s Coterie  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs