Advertisement
Google Ads BL

బాబు గోగినేనిని బాగా ఇరికించేశారు..!


పలు టివి డిబేట్లలో పాల్గొంటూ అందరి మీదా విమర్శలు చేసే హేతువాది బాబు గోగినేని ప్రస్తుతం బిగ్‌బాస్‌ సీజన్‌2లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈయనపై తాజాగా 13 సెక్షన్ల కింద హైదరాబాద్‌ మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. బాబు గోగినేని వ్యక్తిగతంగా గోప్యంగా ఉంచాల్సిన ఆధార్‌నెంబర్లకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేస్తూ ఉంటాడని, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా యూట్యూబ్‌ల్లో మాట్లాడుతుంటాడని, భారతదేశ విదేశాంగ విధానానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారని కె.వి.నారాయణ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రైవేట్‌ కార్యక్రమానికి ఆధార్‌నెంబర్‌ తీసుకోవడంపై ఆయన కోర్టుని ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు బాబు గోగినేనిపై 13 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

Advertisement
CJ Advs

బాబుగోగినేని సౌత్‌ ఏషియన్‌ హ్యూమనిస్ట్‌ అసోసియేషన్‌కి ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నాడు. దీనికి సంబంధించిన కార్యక్రమాలను మలేషియాలో నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాలలో పాల్గొనే వారి ఆధార్‌ నెంబర్లను ఆయన విధిగా తీసుకుంటాడని కె.వి.రమణ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలా సేకరించి వాటి వివరాలను బాబుగోగినేని, ఆయన సన్నిహితులు విదేశాలకు అందిస్తుంటారని, ఇలా చేయడం వ్యక్తిగత స్వేచ్చను హరించడమేనని పేర్కొన్న ఆయన ఈ సందర్భంగా ఫిర్యాదులో బాబుగోగినేని ఇటీవల హైదరాబాద్‌, విశాఖపట్టణం, బెంగుళూరులలో నిర్వహించిన సభల్లో పాల్గొన్న వారి ఆధార్‌నెంబర్లను తీసుకున్న విషయాన్ని సాక్ష్యంగా పొందుపరిచాడు. 

మొత్తానికి బిగ్‌బాస్‌ సీజన్‌1లో నవదీప్‌తో పాటు ముమైత్‌ఖాన్‌లు డ్రగ్స్‌ కేసుల్లో నిందుతులు పాల్గొనగా, ఈ సారి కూడా తనీష్‌తో పాటు పలు వివాదాలకు కేంద్రబిందువైన బాబుగోగినేని కూడా బిగ్‌బాస్‌లలో ఉండటంతో అందరు తప్పులు చేసిన వారికి, ఫ్రీగా పబ్లిసిటీ సాధించి సెలబ్రిటీలు అయిన వారిని బిగ్‌బాస్‌లోకి తీసుకుంటూ వారిని మరింత పెద్ద సెలబ్రిటీలుగా మారుస్తున్నారన్న విమర్శలు మొదలయ్యాయి. 

Case filed against Babu Gogineni:

FIR filed against Babu Gogineni for hurting Religious Sentiments
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs