వంశి పైడిపల్లి - మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న మహేష్ 25 మూవీ తాజాగా డెహ్రాడూన్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేసుకుంది. పీవీపీతో వచ్చిన గొడవలను దిల్ రాజు అండ్ బ్యాచ్ చక్కబెట్టేసి.. పీవీపీ కూడా ఈ సినిమాకొక నిర్మాతగా భాగస్వామ్యం ఇచ్చి సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లిపోయారు. ఈ సినిమాలో కాలేజ్ కుర్రాడిలా కనిపించనున్న మహేష్.. ఆ కాలేజ్ గెటప్ కోసం న్యూ లుక్ ట్రై చేసాడు. గళ్ళ చొక్కా, పక్క పాపిడి, పెరిగిన గెడ్డంతో ఈ ఏజ్ లోను కాలేజ్ కుర్రాడిలా గెటప్ మార్చేసాడు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుతో పూజ హెగ్డే మొదటిసారి జోడి కడుతోంది. అలాగే అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నాడు.
తాజాగా మహేష్ 25 మూవీ విషయంలో ఒక షాకింగ్ ట్విస్ట్ బయటికొచ్చింది. అదేమిటంటే అల్లరి నరేష్, మహేష్ బాబు లు ఈ సినిమాలో స్నేహితులుగా కనబడతారనేది ఎప్పటినుండో ప్రచారం జరుగుతున్న విషయమే. ఇక మహేష్ బాబు ఎంబీఏ స్టూడెంట్ గా రిచ్ గా కనబడితే.. అల్ల్లరి నరేష్ పూర్ గా కనబడతాడనేది కూడా ప్రచారం జరిగింది. తాజాగా ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్ర చనిపోతుంది. అయితే అల్లరి నరేష్ చావుకి గల కారణాలను కనిపెట్టే విషయంలో మహేష్ బాబు ఎదుర్కున్న సమస్యలను వంశి పైడిపల్లి తన స్టయిల్లో చూపించబోతున్నాడట.
మరి అల్లరి నరేష్ గతంలో క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన 'గమ్యం' సినిమాలోనూ తన పాత్ర చనిపోయే పాత్ర వేసాడు. శర్వానంద్, అల్లరి నరేష్ లు స్నేహితులుగా తెరకెక్కిన గమ్యం సినిమాలో క్లైమాక్స్ లో అల్లరి పాత్రని చంపేస్తారు. ఇక ఆ సినిమా ఫీల్ గుడ్ మూవీ గా అందరి మన్ననలు పొందింది. హీరోగా అల్లరి నరేష్ ప్రస్తుతం అస్సలు ఫామ్ లో లేడు. మరి మహేష్ సినిమాలో ఇలా ఫ్రెండ్ కేరెక్టర్ ద్వారా తిరిగి మళ్ళీ క్రేజ్ లోకి వస్తాడేమో చూడాలి.