Advertisement
Google Ads BL

ఈ బయోపిక్ లో మోహన్ బాబు కూడా..!


తెలుగులో చెప్పుకోదగ్గ నటుల్లో మోహన్ బాబు ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన అనుభవం ఉన్న ఆయన గత కొంత కాలం నుండి చాలా తక్కువ సినిమాలు చేయడం..లేదా తన స్థాయికి తగ్గ సినిమాలు చేయకపోవడం వల్ల ఆయన వెనుకబడి పోయి ఉండొచ్చు కానీ ఆయనలో నటుడు..  విలన్.. కమెడియన్ అలానే ఉన్నారు. 

Advertisement
CJ Advs

లేటెస్ట్ గా 'మహానటి' సినిమాలో ఎస్వీఆర్ పాత్రలో తళుక్కుమన్న మోహన్ బాబు త్వరలోనే మరో బయోపిక్ లో చేయడానికి రెడీ అవుతున్నారు. క్రిష్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ జీవిత కథ చిత్రం 'ఎన్టీఆర్' బయోపిక్ లో మోహన్ బాబు ఓ కీలక పాత్ర చేయనున్నారట. అయితే ఇందులో ఆయన పాత్ర ఏదన్నది మాత్రం వెల్లడి కాలేదు. ఎన్టీఆర్ తో మోహన్ బాబుకు ఎంతో గొప్ప అనుబంధమే ఉంది. ఒకరకంగా మోహన్ బాబు కెరీర్ ఎదుగుదలలో ఎన్టీఆర్‌ది కీలక పాత్ర. ఈ విషయాన్నీ అయన ఎన్నో సార్లు చెప్పారు.

ఎన్టీఆర్ రాజీకీయ ప్రవేశం చేసినప్పుడు కొంత కాలం ఆయనతో కలిసి సాగాడాయన. ఎన్టీఆర్ మరణానంతరం బాలయ్యతో మోహన్ బాబు అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. వీరిద్దరికి ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందుకే బాలయ్య ఏమి ఆలోచించకుండా మోహన్ బాబుని బయోపిక్ లో ఓకే చేసినట్టు సమాచారం. అయితే ఇందులో ఆయన ఏ పాత్ర చేస్తాడో.. దాన్నెలా రక్తి కట్టిస్తాడో చూడాలి.

 

Mohan Babu in NTR Biopic:

Mohan Babu signs one more Biopic
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs