Advertisement
Google Ads BL

మహేష్ రెమ్యూనరేషన్ 25 శాతం త్యాగం..!


మహేష్ 25 వ చిత్రానికి వచ్చిన సమస్యలు మహేష్ కెరీర్ లోనే ఏ మూవీకి వచ్చి ఉండవు. మహేష్ - వంశి పైడిపల్లి ల మూవీ పీవీపీ నిర్మాణంలో చెయ్యాల్సి ఉండగా.. మధ్యలోకి తెలివిగా దిల్ రాజు వచ్చాడు. ఇక ఎప్పటినుండో అశ్వినీదత్, మహేష్ కోసం కాచుకుని కూర్చోవడం.. కానీ సినిమాకి పెట్టుబడి పెట్టే కెపాసిటీ లేకపోవడంతో...  మహేష్, అశ్వినిదత్ కి తన 25 వ సినిమాని సమర్పకుడిగా చేసుకున్నాడు. ఇక వైజయంతి మూవీస్ సమర్పణలో దిల్ రాజు నిర్మాతగా మహేష్ హీరోగా వంశీపైడిపల్లి సినిమాని మొదలు పెట్టాడు. అయితే వంశి సినిమా స్క్రిప్ట్, మ్యూజిక్ సిట్టింగ్ పూర్తయ్యి, నటీనటుల ఎంపిక జరిగినప్పటికీ సినిమా సెట్స్ మీదకెళ్లడానికి బాగా గ్యాప్ తీసుకున్నాడు. ఈ మధ్యలో వైజయంతి మూవీస్ లో మహానటి చెయ్యడం..... ఆశ్వినిదత్ తాను కూడా నిర్మాతగా వ్యవహరిస్తానని చెప్పడం... కక్కలేక మింగలేకుండా ఉన్న దిల్ రాజు నిర్మించే మహేష్ 25 మూవీ మీద పీవీపీ కేసు వెయ్యడం... ఇలా మహేష్ 25 వ సినిమాకి సమస్యలు చుట్టుముట్టాయి.

Advertisement
CJ Advs

ఎలాగో పీవీపీ ని దారికి తెచ్చుకుని అశ్విని దత్ అండ్ దిల్ రాజులు మహేష్ 25 మూవీకి మరొక నిర్మాతగా చేర్చుకున్నారు. ఇక ముగ్గురు నిర్మాతలు ఒకే సినిమాని నిర్మించడం అంటే.. ఆ సినిమాకి లాభాలు పెద్దగా ఉండవు. అసలే దిల్ రాజు అశ్విని దత్ విషయంలోనే గుర్రుగా ఉంటే.. ఇప్పుడు పీవీపీ రావడం మరో సమస్య అయ్యింది. మరి ముగ్గురు నిర్మాతల వలన సినిమాకి లాభాలు పెద్దగా ఉండవని నిర్మాతలు ముగ్గురు గగ్గోలు పెడుతుంటే.. చూడలేని మహేష్ తన పారితోషకాన్ని 25 శాతం వరకు తగ్గించుకున్నాడనే టాక్ ఉంది. మరి తన పారితోషకం 25 శాతం తగ్గించుకోవడం వలన సినిమాకి బడ్జెట్ తగ్గుతుంది. అలాగే సినిమాకున్న క్రేజ్ తో భారీగా లాభాలు మూటగట్టుకుంటారు. అలా ముగ్గురు నిర్మాతల నెత్తిన మహేష్ పాలు పోసాడు.

మరి ఇలా పారితోషకాన్ని తన ముగ్గురు నిర్మాతల కోసం త్యాగం చేసినప్పటికీ... ఎలాగూ ముగ్గురు నిర్మాతలతో తనకున్న కమిట్మెంట్ ఒకే ఒక సినిమాతో తీరిపోవడం.. మాత్రం హెడేక్ లేని పని. ఇంతకుముందే అశ్విని దత్ కి, పీవీపీ కి చెరో సినిమా చేస్తానని కమిట్మెంట్ ఇవ్వడం.. ఇలా ఒకే సినిమాకి దిల్ రాజుతో పాటు వారిద్దరూ పనిచేయడంతో.. మహేష్ ఒకే ఒక్క సినిమాతో ముగ్గురుకి సెటిల్ చేసేశాడు.

Mahesh Babu takes cut in remuneration for 25th movie:

Mahesh Babu's 25th Film Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs