Advertisement
Google Ads BL

శ్రీదేవి నటించిన ఏ చిత్రమో అది..?


అతిలోకసుందరి శ్రీదేవి మరణం తర్వాత ఆమె జీవితంపై బయోపిక్‌ రూపొందిస్తారని ప్రచారం జరిగింది. సావిత్రి జీవితంలోలాగానే శ్రీదేవి జీవితంలో కూడా ఎన్నో మలుపులు, వివాదాలు ఉన్నాయి. అయితే సావిత్రి బయోపిక్‌ని తెరకెక్కించే సమయానికి సావిత్రి, జెమిని గణేషన్‌ ఇద్దరు జీవించి లేరు దాంతో ఈజీగానే 'మహానటి'కి ఇబ్బందులు ఎదురు కాలేదు కానీ శ్రీదేవి బయోపిక్‌ అంటే మాత్రం ఆమె భర్త బోనీకపూర్‌ ఇంకా జీవించే ఉన్నాడు. కాబట్టి శ్రీదేవిపై ఎవరైనా బయోపిక్‌ రూపొందించాలన్నా కూడా బోనీ అనుమతి తప్పనిసరి. 

Advertisement
CJ Advs

ఇక తాము శ్రీదేవి బయోపిక్‌ని రూపొందించడం లేదని ఆమెపై ఓ డాక్యుమెంటరీ తీసే ఆలోచన మాత్రం ఉందని బోనీకపూర్‌ ఆమధ్య స్పందించాడు. ఇక తాజాగా బిటౌన్‌లో మరో వార్త హల్‌చల్‌ చేసింది. శ్రీదేవి కీలకపాత్రలో నటించగా, బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 40ఏళ్ల కిందటి ఓ చిత్రానికి రీమేక్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. 40ఏళ్ల కిందట ఈ చిత్రాన్ని ఓ దక్షిణాది నిర్మాత నిర్మించగా, ఉత్తరాది బాలీవుడ్‌ దర్శకుడు డైరెక్ట్‌ చేశాడు. 

ఇంత వరకు సమాచారం లభించిందే గానీ శ్రీదేవి నటించిన ఆ 40ఏళ్ల నాటి సినిమా ఏది? అనే విషయంలో మాత్రంక్లారిటీ రావడం లేదు. ఏదో ఒకటి ఊహించే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే శ్రీదేవి కెరీర్‌లో అద్బుతమైన చిత్రాలు, బ్లాక్‌బస్టర్స్‌ అనేకం ఉన్నాయి. మరి ఈ చిత్రం విషయంలో త్వరలో క్లారిటీ రానున్నట్లు సమాచారం. 

Boney Kapoor plans a film on Sridevi:

Sridevi's life to be turned into a film by Boney Kapoor
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs