Advertisement
Google Ads BL

తమ్మారెడ్డిగారూ..ఏం మాట్లాడుతున్నారు మీరు?


దాసరి బతికున్నంతకాలం ఆయనే సినిమా పరిశ్రమకు పెద్దదిక్కుగా ఉన్నాడు. నాడు దాసరిపై తమ్మారెడ్డి భరద్వాజ దాదాపు యుద్దం ప్రకటించాడు. దాసరే కాదు నేను కూడా సినీ పెద్దనే అని వాదించాడు. కానీ దాసరి మరణం తర్వాత మాత్రం సినీపెద్దగా వ్యవహరించడానికి ముందుకు రాకుండా ఈయన కూడా పవన్‌కళ్యాణ్‌లా ట్వీట్స్‌, యూట్యూబ్‌రాయుడు అయిపోయాడు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా ఈయన మాట్లాడుతూ, చాలా మంది మనుషులు సినిమా వారిని కలలో ఊహించుకుని తృప్తి పడుతూ ఉంటారు. అబ్బాయిలైతే హీరోయిన్ల, అమ్మాయిలైతే హీరోలను ఊహించుకుంటారు. కానీ ఈ విషయాలను వారు బయటపెట్టేందుకు ఒప్పుకోరు. కానీ కొందరు మాత్రం ఫలానా హీరోయిన్‌తో నాకు సంబంధం ఉంది.. ఫలానా హీరోతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని సోషల్‌మీడియాలో నీచమైన కామెంట్స్‌ చేస్తున్నారు. వీటిని హైలైట్‌ చేయడం వల్ల మీడియాకి వచ్చేది ఏమీ లేదు. అంతేకాదు ఉన్న క్రెడిబులిటీ, పరపతి పోతుంది. ఇలా నీచమైన కామెంట్స్‌ చేస్తూ, పబ్లిసిటీ పొందుతూ, దిగజారి పోయేలా ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా ఏదైనా ఆరోపణచేసే ముందు ఆధారాలతో బయటకి రావాలి... అని తెలిపాడు.

అలాగే ఇంకా బిగ్‌బాస్‌పై కూడా స్పందించాడు. నేరం చేసిన వారికి మాత్రమే బిగ్‌బాస్‌లోకి ఎంట్రీలు లభిస్తున్నాయన్నవార్తలపై ఆయన విరచుకుపడ్డాడు. అలా అయితే తప్పు చేసిన వారందరినీ బిగ్‌బాస్‌లోకి తీసుకుంటారా? అని ప్రశ్నించాడు. మొత్తానికి తమ్మారెడ్డి ఆవేదన చూస్తే కేవలం మీడియాదే తప్పు.. సినిమా ఇండస్ట్రీ అంతా రాముళ్లు, సీతలే ఉన్నారన్నవిధంగా ఆయన వాదన ఉంది. 

TammaReddy Bharadwaja Responds on Tollywood Sex Racket:

Tammareddy Bharadwaj Latest Interview about Sex Racket and Bigg Boss
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs