Advertisement
Google Ads BL

నన్నర్ధం చేసుకున్నందుకు థాంక్స్‌: రేష్మి!


ఎంతోకాలంగా బుల్లితెరపై మంచి కెమిస్ట్రీ పండించడంలో యాంకర్‌, నటి రేష్మి, 'జబర్ధస్త్‌' ఫేమ్‌ సుడిగాలి సుధీర్‌లు ముందుంటున్నారు. వారు చేసే స్కిట్స్‌, వారు స్క్రీన్‌పై వేసుకునే డైలాగ్స్‌, ఇతరులు వారిపై వేసే జోక్స్‌ చూస్తే అందరు రేష్మి, సుడిగాలి సుధీర్‌ల మధ్య సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌ ఉందంటారు. కానీ ఈ విషయాన్ని వారిద్దరు ఎప్పటి నుంచో ఖండిస్తూ వస్తున్నారు. అయినా ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా రేష్మి ట్విట్టర్‌లో తన అభిమానులతో చిట్‌చాట్‌ చేస్తుండగా, ఓ నెటిజన్‌ రేష్మి... నువ్వు సుడిగాలి సుధీర్‌ని పెళ్లి చేసుకో. మీ ఇద్దరి జంట చూడముచ్చటగా, మేడ్‌ ఫర్‌ ఈజ్‌ అదర్‌ అన్నట్లుగా ఉంటుంది. మీరిద్దరు ఎంతో కష్టపడి ఈ స్టేజీకి వచ్చారని ఉచిత సలహా ఇచ్చాడు దాంతో రేష్మికి ఒళ్లు మండిపోయింది. 

Advertisement
CJ Advs

రీల్‌లైఫ్‌ వేరు, రియల్‌ లైఫ్‌ వేరు అనే విషయంలో కాస్త అవగాహన పెంచుకోండి. మీరు చెబితే నేను పెళ్లి చేసుకోవాలా? మీరు ఎవరిని చెబితే వారిని చేసుకోవాలా? కాస్త అయినా మానసికంగా ఎదగండి. కేవలం ప్రేక్షకులను అలరించేందుకే తెరపై అలా కనిపిస్తాం. అలాగని మా వ్యక్తిగత వ్యవహారాలను కూడా మీరే నిర్ణయిస్తారా? అంటూ మండిపడింది. ఇక తాజాగా ఓ నెటిజన్‌ మాత్రం రేష్మికి కాస్త ఊరట లభించే విధంగా స్పందించాడు. రేష్మి మీ నిర్ణయం బాగుంది. సోదర సోదరీమణులారా.. ఓ విషయం ఆలోచించండి. మీరందరు ఓకే చెప్పారని, సుడిగాలి సుధీర్‌ని పెళ్లి చేసుకోమన్నారని రేష్మి ఆయన్ను వివాహం చేసుకుని, తర్వాత విభేదాలు వచ్చి విడిపోతే సలహా ఇచ్చిన మీరు వారిద్దరిని కలుపుతారా? ఆమె ఓ మహిళ. 

ఆమెకి కూడా సొంత ఆలోచనలు ఉంటాయి. ఆమెను తన స్వంత ఆలోచనల దారిలో వెళ్లనివ్వండి అని తెలిపాడు. దీంతో రేష్మి ఎంతో సంతోషించి ఆయనకు రిప్లై ఇచ్చింది. నన్ను అర్ధం చేసుకున్నందుకు థాంక్స్‌ అంటూ ట్వీట్‌ చేసింది. 

Rashmi Says Thanks to Netizen:

Rashmi Chit Chat with Netizen in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs