Advertisement
Google Ads BL

రానాకి కోపం వచ్చింది.. క్లారిటీ ఇచ్చేశాడు!


నేడు మీడియా ఎలా తయారైపోయిందంటే అదిగో పులి.. అంటే ఇదిగో తోక అన్నట్లుగా మారింది. స్వయాన సెలబ్రిటీలు వాటిని ఖండించినా, వాస్తవాలను తెలియజెప్పినా కూడా మరలా మరలా అవే గాలి వార్తలను కొన్ని మీడియాలు వ్యాప్తి చేస్తూ ఉంటాయి. ఇక విషయానికి వస్తే తనకు ఒక కన్ను మాత్రమే కనపడుతుందని, రెండో కన్ను సరిగా కనిపించదని దగ్గుబాటి రానా చాలా కాలం కిందటే తెలియజేశాడు. ఆ తర్వాత ఆయన తండ్రి సురేష్‌బాబుతో పాటు రానా కూడా తన కన్ను బాగా బాధిస్తోందని, త్వరలో విదేశాలకు వెళ్లి కంటికి ఆపరేషన్‌ చేసుకుంటానని ఓపెన్‌గానే చెప్పాడు. 

Advertisement
CJ Advs

కానీ కొందరు మాత్రం రానా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడని, అసలు సమస్య కన్ను కాదని, కిడ్నీలనే ప్రచారం చేస్తూ వస్తున్నారు. వీటిని ఇప్పటికే ఖండించిన రానా మరలా అవే వార్తలు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాకు బిపీ సమస్య తప్ప మరే సమస్యలేదు. దానిని కూడా కంట్రోల్‌లో ఉంచుకుంటున్నాను. ఇది నా ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి దీనిపై పుకార్లు సృష్టించవద్దు. నాపై మీరు చూపుతున్న ప్రేమకు నా ధన్యవాదాలు అని తెలిపాడు. 

ఇక రానా ప్రస్తుతం కాస్త బిపీ సమస్యతో బాధపడుతున్నందున దానిని కంట్రోల్‌ లోకి తెచ్చిన తర్వాతే తన కంటి ఆపరేషన్‌ చేయించుకోనున్నాడు. కాగా ప్రస్తుతం రానా మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇక గుణశేఖర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందే 'హిరణ్యకస్యప'ను కూడా ఓకే చేశాడు. ఇది సురేష్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.

Rana Rubbishes Ill Health Rumours:

Rana Quashes Kidney Transplantation Rumours
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs