Advertisement
Google Ads BL

రేణు రెండో పెళ్ళికి పవన్ గ్రీన్ సిగ్నల్!


ఈమధ్యన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నిశ్చితార్ధం పవన్ ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఎప్పుడో తాను రెండో పెళ్లి చేసుకుంటానని అలా అందో లేదో.. ఇలా పవన్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ మీద ట్రోలింగ్ మొదలెట్టేశారు. ఇక మధ్యలో రేణు దేశాయ్ పెళ్లి విషయంలో చిన్న చిన్న హింట్స్ ఇస్తూ.. రెండు రోజుల క్రితం తన మనసుకు నచ్చిన... అతనితో నిశ్చితార్ధం చేసుకుంది. మరి పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కి విడాకులివ్వగానే...మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కన్నాడు. కానీ రేణు తన ఇద్దరి పిల్లలతో ఒంటరిగా ఉంది. తాజాగా తన పిల్లల సమక్షంలోనే రేణు దేశాయ్ మరో వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది రేణు రివీల్ చేయకుండా తన ఫొటోస్, ఉంగరాలు మార్చుకున్న ఫొటోస్ ని, తనకి తన పిల్లలు అకీరా, ఆద్య అండగా ఉన్నారనిపించేలా మరో ఫోటో ని రేణు పోస్ట్ చేసింది. ఇక రేణు నిశ్చితార్ధం అయ్యాక పవన్ ఫ్యాన్స్ కూడా గమ్మునుండిపోయారు.

Advertisement
CJ Advs

అయితే రాజకీయాల్లో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ రేణు నిశ్చితార్ధం విషయంపై రెండు రోజులు ఆలస్యంగా స్పందించాడు. రేణు దేశాయ్ మరో వ్యక్తితో నిశ్చితార్ధం చేసుకున్న విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ ఆమెకి శుభాకాంక్షలు తెలిపాడు. తన ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ని ఉద్దేశించి... సంతోషం కోసం కొత్త జీవితంలోకి ప్రవేశిస్తున్న రేణు గారు... నా హృదయపూర్వక అభినందనలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, మీకు శాంతి, శ్రేయస్సు కలగాలని నేను భగవంతుడిని, ప్రకృతిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అంటూ రేణు దేశాయ్ చేసుకునే రెండో పెళ్ళికి చాలా హుందాగా పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఇక పవన్ కళ్యాణ్, రేణు పెళ్లి విషయంలో ఇంత పాజిటివ్ గా స్పందించడంతో.. పవన్ ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. ఇక పవన్ ఫ్యాన్స్ కూడా రేణు దేశాయ్ కి కాబోయే భర్తని చిన్నగా అభివర్ణిస్తూ విషెస్ చెప్పేస్తున్నారు. మరి రేణు దేశాయ్ తనకు కాబోయే భర్త విషయంలో కాస్త టెంక్షన్ పడుతున్నట్లుగా వుంది. లేకుంటే కేవలం నిశ్చితార్థంలో... తన ఫొటోస్ చూపించిన రేణు తనకు కాబోయే భర్తని మాత్రం దాచేసింది.

Pawan Kalyan shocking Tweet on Renu Desai Second Marriage:

Pawan Kalyan's advice on Renu Desai's second marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs