Advertisement
Google Ads BL

సెక్స్ రాకెట్ ఎఫెక్ట్.. సురేఖా వాణిపై..!!


మన సినీ పెద్దలు ఇండస్ట్రీపై ఏమైనా ఆరోపణలు వస్తే మౌనంగా అయినా ఉంటారు... లేదా తాము ఏ తప్పు చేయలేదని, ఎవరో ఏదో చేస్తే మమ్మల్ని ఎందుకు బజారుకీడుస్తారని ప్రశ్నిస్తూ ఉంటారు. అంతేగానీ వచ్చిన ఆరోపణల్లో నిజమెంత? అని నిర్ధారణ చేసుకుని, అలాంటివి మరలా రిపీట్‌ కాకుండా మాత్రం చూసుకోరు. ఇక తాజాగా అమెరికాలోని చికాగోలో టాలీవుడ్‌ నటీమణుల వ్యభిచార భాగోతం బయటపడి సంచలనం సృష్టిస్తూ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాంతో టాలీవుడ్‌ పరువు దేశవిదేశాలలో బూడిదలో కలిసి పోతోంది. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే తాజాగా మన సెలబ్రిటీలు అమెరికాలో తెలుగు వారు స్థాపించిన ఆటా, తానా, నాటాలు మన సినీ సెలబ్రిటీలు , ఇతర రంగాలలో ప్రముఖులైన వారిని అమెరికా ఆహ్వానించి పలు సదస్సులు, వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ చికాగో సెక్స్‌రాకెట్‌ బయటపడటంతో యూఎస్‌ కాన్స్‌లేట్‌ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వేడుకలకు హాజరయ్యే వారికి ట్రావెల్‌ వీసాలను నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నారు. వివిధ తెలుగు సంఘాల ఆహ్వానంపై అమెరికా వెళ్లేందుకు దరఖాస్తు చేసుకుంటున్న వారు యూఎస్‌ కాన్సులేట్‌ నుంచి తిరస్కరణకు గురవుతున్నారు. 

తాజాగా అమెరికా వెళ్లేందుకు బి1బి2 ట్రావెల్‌ వీసా కోసం అప్లై చేసుకున్న నటి, డ్యాన్సర్‌ సురేఖా వాణి కాన్సులేట్‌ కార్యాలయానికి ఇంటర్వ్యూకి వెళ్లింది. అక్కడి అధికారులు ఏ పని నిమిత్తం అమెరికా వెళ్తున్నారని ప్రశ్నించడంతో ఆమె ఆటా సదస్పు కోసం అని చెప్పడంతో ఆమె తిరస్కరణకు గురైంది. ఇదే సభలకు వెళ్లేందుకు ప్రముఖ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి మేకా మహేందర్‌రెడ్డి పెట్టుకున్న వీసా దరఖాస్తుని కూడా అధికారులు తిరస్కరించారు. తెలుగు సంస్థల సదస్సులు, కార్యక్రమాల పేరు చెబితే వెంటనే అధికారులు రిజెక్ట్‌ చేస్తున్నారు. ఇలా నూటికి 90శాతం మంది వీసాలు తిరస్కరణకు గురవుతుండటం, మెహ్రీన్‌ వంటి వారు స్వంత పనులపై అమెరికా వెళ్లినా కూడా పలు ఇబ్బందులను ఎదుర్కోవడం చూస్తే ఈ సెక్స్‌ రాకెట్‌ ఎంతగా ప్రభావం చూపుతోందో అర్ధమవుతోంది...! 

Actress Surekha Vani gets Visa shock:

Actress Surekha Vani Visa Rejected about ATA
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs