గత కొంతకాలంగా పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ రెండో వివాహం చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె తన నిశ్చితార్దం జరిగిందని చెబుతూ, తనకు కాబోయే భర్తతో కలిసి ఉంగరాలు మార్చుకునే ఫొటోలను పోస్ట్ చేసింది. దీనిపై కొందరు పవన్ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తుండగా, మరికొందరు మాత్రం రేణుకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె జీవితం భర్తా, పిల్లలతో నిండు నూరేళ్లు వెలగాలని కోరుకుంటూ మెసేజ్‌లు పెడుతున్నారు. మరికొందరు నిశ్చితార్ధం జరిగిన తర్వాత కూడా ఆ వ్యక్తిని, ఆయన వివరాలను గోప్యంగా ఉంచడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. తాను ఎవరిని వివాహం చేసుకోనున్న విషయాన్ని రేణుదేశాయ్ బయట పెట్టలేదు. తాను పట్టుచీర కట్టుకుని తన కుమారుడు, కుమార్తెతో కలిసి నడుస్తున్న ఫోటోని పోస్ట్ చేసిన ఆమె అంతకు ముందు ఓ వ్యక్తి ఆమె చేతికి నిశ్చితార్ధపు ఉంగరాన్ని తొడుగుతున్న ఫొటోని పోస్ట్ చేయగా అది వైరల్ అయింది.
ఇక తన పెళ్లి విషయంలో పవన్ ఫ్యాన్స్ చేసిన పలు కామెంట్స్‌కి ఆమె ధీటుగా సమాధానం చెప్పింది. 'మేడమ్ మీరు రెండో వివాహం చేసుకోవద్దు. అలా చేసుకుంటే ఇతరులకు మీకు తేడా ఉండదు. అసలు మీలాంటి అందమైన భార్యని పవన్ ఎందుకు వదిలేశాడో అర్ధం కావడం లేదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దానికి రేణు స్పందిస్తూ ఇలాంటి క్రేజీ అబ్మాయిలు వారి తల్లులతో, సోదరీమణులతో ఎలా ప్రవర్తిస్తారో? వారి మానసిక ఆరోగ్యం గురించి చింతిస్తున్నానని రిప్లై ఇచ్చింది.
ఆమె వివాహంపై మరో అభిమాని స్పందిస్తూ, మీరు వివాహం చేసుకుంటే గొడవలు వస్తాయి. నా దేవుడికి ఎలాంటి సమస్యా రాకూడదు. ఏం చేసినా ఆలోచించి చేయండి అని తెలుపగా రేణు 'క్రేజీ' అంటూ స్పందించింది. ఇక తన పెళ్లి విషయంలో బాగా పాజిటివ్‌గా స్పందిస్తున్న వారికి ఆమె కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ తల్లులు మిమ్మల్ని ఎంతో బాగా పెంచారు.. అంటూ ప్రశంసించింది.