Advertisement
Google Ads BL

సన్నీ.. అభిమానులకు ఊరట!


ఉత్తరాఖండ్‌లో ఎంటీవీ స్ప్లిట్స్‌ విల్లే సీజన్‌ 11కి సంబంధించిన షూటింగ్‌ నైనిటాల్‌ దగ్గరగా ఉండే రామ్‌పూర్‌జిల్లా కాశీపూర్‌లో జరుగుతోంది. ఇందులో సన్నిలియోన్‌ నటిస్తోంది. ఈ షూటింగ్‌ సందర్భంగా సన్ని తీవ్ర అస్వస్తతకు లోనైంది. తీవ్రమైన కడుపు నొప్పి, గ్యాస్ట్రో ఎంటరైటిస్‌తో బాధపడుతూ ఆమె అర్ధరాత్రి హాస్పిటల్‌లో చేరింది. ప్రయాణ బడలిక, తీవ్రమైన ఉక్కపోత, విపరీతమైన వేడి వల్ల ఆమె కడుపు ఇన్‌ఫెక్షన్‌కి లోనైంది. ఈ విషయం తెలిసి ఆ హాస్పిటల్‌ వద్దకు ఆమె అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా ఆమె మేనేజర్‌ మాట్లాడుతూ.. ఓ రియాల్టీ షో షూటింగ్‌ నిమిత్తం ప్రస్తుతం సన్నిలియోన్‌ ఉత్తరాఖండ్‌లో ఉంది. కాగా ఆమెకి అర్ధరాత్రి పూట తీవ్రమైన కడుపునొప్పి రావడంతో అక్కడే ఉన్న బ్రిటిష్‌ ఆసుపత్రిలో జాయిన్‌ అయింది. ఆమె మైల్డ్‌ ఫీవర్‌తో పాటు తీవ్రమైన కడుపునొప్పితో హాస్పిటల్‌లో జాయిన్‌ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చికిత్స తర్వాత ఆమె బాగా కోలుకున్నారు. ఆమెని హాస్పిటల్‌ నుంచి కూడా వెంటనే డిశ్చార్జ్‌ చేశారు. సన్ని కాస్త అనారోగ్యానికి లోనైన విషయం నిజమే. వైద్యులు బెడ్‌రెస్ట్‌ సూచించారు..అని తెలిపాడు.  

తిరిగి ఆమె సోమవారం షూటింగ్‌ కోసం సెట్స్‌లో జాయిన్‌ అవుతుందని ఆశిస్తున్నాం. అప్పటివరకు సన్ని ప్రమేయం లేని సన్నివేశాలను చిత్రీకరించనున్నామని చిత్రయూనిట్‌ తెలిపింది. సో.. సన్ని ఫ్యాన్స్‌ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఏమి లేదనే చెప్పాలి. 

DON'T WORRY SUNNY IS SAFE:

​Sunny Leone discharged from Uttarakhand hospital
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs