నేటితరం దర్శకులు, నటీనటులు సినిమా రంగంపై ఆసక్తి పెంచుకుంటూ రావడానికి కారణం వారు మొదటి నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ, ఆయనకు అభిమానులుగా ఉన్నవారే. ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకపోయినా కృషి, పట్టుదల ఉంటే మెగాస్టార్ రేంజ్‌కి ఎదగవచ్చని చిరు నిరూపించి చూపించాడు. దాంతో ఆయన నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతగానే చెప్పాలి. నేటి స్టార్ దర్శకులు, ఇతర నటీనటులు తరచుగా చెప్పే మాటలు ఇవే ఉంటాయి. ఎవ్వరూ తమ కెరీర్ ప్రస్థానంలో చిరంజీవి పేరు వినిపించకుండా తమ ఎదుగదలను చెప్పడం సాధ్యంకాదు.
ఇక ఈ జాబితాలోకి తాజాగా కమెడియన్ షకలకశంకర్ కూడా చేరాడు. ఆయన స్జేటీ మీద ఉంటే చిరంజీవి ప్రస్తావన తేవడమో, పవన్‌కళ్యాణ్‌ని అనుకరించడమో ఖచ్చితంగా చేస్తాడు. తాజాగా ఆయన తనకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాకు ఊహ తెలిసిన తర్వాత నేను విన్న హీరో పేరు మొదట చిరంజీవి. నేను స్కూల్‌కి వెళ్లడమే గానీ చదువుకునే వాడిని కాదు. చిరంజీవి గారి బొమ్మలు గీస్తూ ఉండేవాడిని. చదువుకోమంటే బొమ్మలేస్తావేంట్రా అని మాష్టారు నన్ను తెగకొడుతూ ఉండేవారు. అయినా పట్టించుకోకుండా మాస్టారు పాఠం చెప్పేలోగా చిరంజీవిగారి బొమ్మలు గీసేవాడిని.
ఇక నన్ను కొట్టి ప్రయోజనం లేదని ఆయన భావించారు. ఇక వీడు మారడు అని నిర్ణయించుకుని నేను గీసిన చిరంజీవి బొమ్మలకే రైట్లు కొట్టేసి వెళ్లిపోయేవారు. చిరంజీవి గారంటే నాకంత ఇష్టం. పవన్‌కళ్యాణ్ గారంటే ప్రాణం..అని చెప్పుకొచ్చాడు. ఒక్క షకలక శంకరే కాదు... యావత్ జబర్ధస్త్‌టీంలోని అందరు చిరంజీవికి వీరాభిమానులే అన్న విషయం అందరికీ తెలిసిందే.