Advertisement
Google Ads BL

అమలాపాల్ లిస్ట్‌లో చాలామందే ఉన్నట్లున్నారే!


నటిగానే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా అమలాపాల్‌ అత్యంత వివాదాస్పదమైన వ్యక్తి. నటిగా ఓ వెలుగు వెలుగుతున్నప్పుడే ప్రేమ, పెళ్లి అంటూ దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగి వివాహం చేసుకుంది. ఎంత త్వరగా ఈ ప్రేమ కథ పెళ్లిపీటలకు చేరిందో అంతే వేగంగా ఆమె ఎ.ఎల్‌.విజయ్‌కి విడాకులిచ్చేసింది. మరో పెళ్లి చేసుకున్నా కూడా మరలా ప్రేమ వివాహమే చేసుకుంటానని చెప్పిన ఆమె తన వ్యక్తిగత జీవితంపై ఎప్పుడు పశ్చాత్తాపం చెందినట్లుగా కనిపించదు. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత ఆమెకి రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌తో ఎఫైర్‌ ఉందని కోలీవుడ్‌ మీడియా కోడైకూసింది. ధనుష్‌తోనే కాదు ఆమెకి చాలామందితో ఎఫైర్లు ఉన్నాయని సుచీలీక్స్‌ ద్వారా బయటపడింది. ఇక కేరళ ప్రభుత్వానికి టాక్స్‌ ఎగ్గొట్టడం, ప్రముఖ వ్యాపారవేత్త తనపై లైంగిక వేధింపులు చేశాడనే విషయాలలో కూడా వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె మాధవన్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొని తన తొలిప్రేమ వివరాలను వెల్లడించింది. అందరిలాగే తనకి కూడా తొలి ప్రేమ ఉందని, అతను ఎవరో కాదు చాక్లెట్‌ బాయ్ మాధవన్‌, తాను చిన్ననాటి నుంచి మాధవన్‌ని ఎంతో ప్రేమించే దానినని చెప్పకొచ్చింది. 

ఈ సందర్భంగా తన పక్కనే ఉన్న మాధవన్‌ని ఆమె కౌగలించుకుని తన ప్రేమ ఇప్పటికీ అలాగే ఉందని చెప్పుకొచ్చింది. అయినా మాధవన్‌ అంటే ఇష్టపడని అమ్మాయిలు ఎవరుంటారు చెప్పండి? అమలాపాల్‌ ఈ విషయాలను చెప్పేటప్పుడు మాధవన్‌ ముసిముసిగా నవ్వుకుంటూ కనిపించాడు. అయినా భార్యాపిల్లలతో హ్యాపీగా సంసారం చేసుకుంటున్న మాధవన్‌ మీద ఈమె కళ్లు పడ్డాయంటే ఇప్పటికైనా ఆయన భార్య ఆమె కంటి చూపు తన భర్తపై పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని చెప్పాలి...! 

Amala Paul Reveals Her First Love With Madhavan:

Amalapaul About Her First Love Madhavan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs