Advertisement
Google Ads BL

ఎంగేజ్‌మెంట్ పిక్: రేణు దేశాయ్ షాకిచ్చిందిగా!!


పవన్ సెకండ్ భార్య రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుని ఇద్దరి పిల్లల్ని కన్నాక.. పవన్ కి రేణు దేశాయ్ మధ్యన వచ్చిన మనస్పర్ధలతో విడిపోయి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో విడిపోయాక మళ్ళీ అన్నా లెజెనోవా ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కన్నాడు. కానీ రేణు దేశాయ్ పూణే లో పిల్లల్ని చదివించుకుంటూ ఒంటరిగానే ఉండిపోయింది. అయితే ఆమెకి ఆరోగ్యపరమైన సమస్య వచ్చినప్పుడు తనని బాగా చూసుకుని, తనని అర్ధం చేసుకునే ఒక తోడు ఉంటే బావుంటుందని చెప్పడం... అదికాస్తా ఇప్పుడు నిజమవడం జరిగాయి.

Advertisement
CJ Advs

గత వారం రోజుల నుండి రేణు దేశాయ్ పెళ్లి చేసుకుంటుందని ఆమె ఇచ్చిన లీకులతో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. అయితే పవన్ అభిమాని ఒకడు రేణు రెండో పెళ్లి విషయమై కామెంట్ చేస్తే అతనికి వాచిపోయేలా రేణు దేశాయ్ సమాధానమివ్వడం సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. అయితే తాజాగా రేణు దేశాయ్ పోస్ట్ చేసిన కొన్ని ఫొటోస్  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఫొటోలో రేణు దేశాయ్ తనకి నిశ్చితార్ధం జరిగిందని కన్ఫర్మ్ చేసింది. కేవలం తనకి కాబోయే భర్తని మాత్రమే చూపించలేదు గాని.. మిగతా తతంగం అంటే నిశ్చితార్ధపు ఉంగరాల దగ్గర నుండి.. ఈ నిశ్చితార్ధాన్ని తన పిల్లలు ఎంతగా సపోర్ట్ చేస్తున్నారో అనే విషయాన్ని కూడా ఆ పిక్స్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.  

ఇక రేణు దేశాయ్ ఆ ఫొటోస్ తో పాటుగా.... నాకు సహాయంగా నిలిచినందుకు నీ నిజాయితీ మనసుకు ధన్యవాదాలు అని రేణు పోస్ట్ చేసింది. ఇక రేణు దేశాయ్ కి నిశ్చితార్ధం జరిగిపోయింది. ఇక మిగిలింది పెళ్లి. మరోపక్క రేణు దేశాయ్ తన రెండో పెళ్లి విషయంలో తనకు మద్దతుగా నిలిచిన పవన్ ఫ్యాన్స్ కి కూడా ఆమె కృతఙ్ఞతలు తెలిపింది.

Renu Desai Secret Engagement Pics Viral:

Renu Desai's Engagement Photo's Gone Viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs