Advertisement
Google Ads BL

అకీరాపై క్లారిటీ ఇచ్చిన రేణు!


 

Advertisement
CJ Advs

తాజాగా పవన్‌కళ్యాణ్‌ తన భార్య అన్నాలెజినోవాతో కలిసి తన కుమారుడు అకీరానంద్‌తో విజయవాడలోని అద్దె ఇంటిలో శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశాడు. ఇలా పవన్‌తో అకిరా కనిపించడంతో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పవన్‌కి నట, రాజకీయ వారసుడు వచ్చేశాడని, ఇక నుంచి ఆయన తన తండ్రితోనే ఉండి నటనలో శిక్షణ తీసుకుంటాడని ప్రచారం చేస్తున్నారు. మరి కొందరు ఈ విషయమై రేణుదేశాయ్‌కి ట్వీట్లు కూడా పెడుతున్నారు. 

రేణుదేశాయ్‌ మరో వివాహం చేసుకోనున్న నేపధ్యంలో ఇక అకీరా పవన్‌తోనే ఉండిపోతాడని ప్రచారం సాగుతోంది. నిజానికి పవన్‌ తన కంటికి శస్త్రచికిత్స తీసుకోవాలని భావించాడు. ఆ సమయంలో తన తండ్రి వెంట ఉండి చేదోడు వాదోడుగా ఉండేందుకు అకీరా పవన్‌ వద్దకు వచ్చాడనే వార్తలు కూడా హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలు మరీ శృతిమించడంతో తాజాగా రేణూదేశాయ్‌ దీనిపై స్పందించి అందరికీ క్లారిటీ ఇచ్చింది. 

తన హాలీడేస్ గడిపేందుకు తన తండ్రి వద్దకు వచ్చాడు. అకీరా హైదరాబాద్‌కి షిఫ్ట్‌ కాలేదు. పవన్‌తో కలిసి అకీరా కనిపించడంతో నిన్నటి నుంచి నాకు అదే పనిగా మెసేజ్‌లు వస్తున్నాయి. ఆ మెసేజ్‌లకు ఫుల్‌స్టాప్‌ పెట్టి క్లారిటీ ఇచ్చేందుకే ఈ విషయాన్ని ప్రత్యేకంగా తెలుపుతున్నానని రేణుదేశాయ్‌ చెప్పుకొచ్చింది. అయినా భార్యాభర్తలు విడిపోయిన తర్వాత పిల్లలు ఎవరితో అయినా కలిసి ఉండవచ్చు. కొంత కాలం గడపవచ్చు. దీనిపై ఇలాంటి వార్తలు ప్రచారంలోకి రావడంతో రేణుదేశాయ్‌కి కాస్త చిరాకు తెప్పించి ఉంటాయనేది ఆమె మాటలను బట్టి చూస్తే అర్ధమవుతోంది. 

Renu Desai's Clarity on Akira Nandan:

Renu Desai's Tweet on Akira Hurts Pawan Kalyan's Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs