Advertisement
Google Ads BL

రేణుదేశాయ్ పెళ్లిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది!


పవన్‌కళ్యాణ్‌ నుంచి విడిపోయిన తర్వాత కూడా చిన్నగా ఉన్న తన పిల్లల బాగోగులు చూసుకుంటూ ఒంటరిగానే రేణుదేశాయ్‌ జీవితాన్ని సారదీస్తోంది. కానీ మరోపక్క పవన్‌ మాత్రం తన మూడో భార్యతో, పిల్లలతో సంతోషంగా ఉన్నాడు. ఇక రేణుదేశాయ్‌ ఆ మద్య తన ఆరోగ్యం బాగా లేని సమయంలో బాధగా ఫీలయ్యానని, తనకు తోడులేని ఒంటరితనం ఆవహించిందని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ఇటీవల ఆమె ఓ వ్యక్తి చేయి పట్టుకుని ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేస్తూ, నీతో ఉంటే సంతోషంగా, శాంతంగా ఉంటుంది. నా చేయి ఎప్పటికి విడువ వద్దు. నాకు నీపై అంచంచల విశ్వాసాన్ని నీవే కల్పించావు అంటూ కవితను పోస్ట్‌ చేసింది. 

Advertisement
CJ Advs

ఇక తన కుమారుడు అకిరానందన్‌ని కూడా తండ్రి నీడలో పెరగడానికి ఒప్పుకోనని, తన కుమారుడిని జూనియర్‌ పవర్‌స్టార్‌ అంటే ఒప్పుకోనని తెలిపింది. తాజాగా ఆమె తన రెండో వివాహం గురించి అందరికీ మరింత క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లి అతనితోనే అని చెబుతూ, అతనికి సంబంధించిన విషయాలను కూడా ఆమె ప్రస్తావించడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా తన కాబోయే భర్త తనకి ఇచ్చే మెసేజ్‌లను చదివే ప్రైవసీని కూడా నా స్నేహితులు ఇవ్వడం లేదు. స్విమ్‌ సూట్‌లో తాను ఫొటోలను చూస్తూ ముసిముసిగా నవ్వుతూ ఉండగా, స్నేహితులు తీసిన ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో పంచుకుంది. 

ఈ ఫోటో, ఆమె కామెంట్స్‌ చూస్తే త్వరలో పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల వదిన బానిసపు శృంఖలాలు తెంచుకుని వివాహం చేసుకోవడానికి రెడీ అవుతోందని, త్వరలో రేణు పెళ్లి బాజాలు మోగడం ఖాయమని తెలుస్తోంది. పిల్లలు తమ పనులు తాము చేసుకుని, అన్నింటిని ఆలోచించే వయసు దాకా వేచిచూసిన ఆమె ఇకపై వివాహం చేసుకోవడం మంచి పనే అని చెప్పాలి. 

Renu Desai Gives Clarity About Her Second Marriage:

Renu Desai Gives More Clarity On second Marriage with Her Comments
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs