Advertisement
Google Ads BL

సన్నీకి అస్వస్థత.. ఫ్యాన్స్ లో ఆందోళన!


మనదేశంలో దేవుళ్లు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే తాము అభిమానించే నటీనటుల విషయంలోనే వారి అభిమానులు ఆందోళనకు గురవుతూ ఉంటారు. చెల్లి, తల్లికి బాగా లేకపోయినా పట్టించుకోని వారు తాము అభిమానించే హీరోల కోసం పూజలు, హోమాలు, వారి ఆరోగ్యం కోసం పాలాభిషేకాలు, బీర్లతో కూడా అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో కోలీవుడ్‌ తర్వాతనే ఎవరైనా. 

Advertisement
CJ Advs

ఇక తాజా విషయానికి వస్తే గతంలో పోర్న్‌స్టార్‌గా నటించి, ఆ తర్వాత ఇండియాకి వచ్చి బాలీవుడ్‌తో పాటు దక్షిణాది ప్రాంతీయ భాషల్లో కూడా ఐటం భామగా, సెక్స్‌బాంబ్‌గా, నటిగా కూడా మంచి అవకాశాలనే సంపాదిస్తోంది శృంగార దేవత సన్నిలియోన్‌. ఆమె దేశంలో ఎక్కడికి వెళ్లినా కూడా ప్రధాని, ముఖ్యమంత్రులు, స్టార్‌ హీరోల కంటే ఈమెని చూసేందుకే ప్రేక్షకులే కాదు.... సినీ రంగానికి చెందిన వారు కూడా ఆరాటపడుతూ ఉంటారు. ఆ మద్య ఆమె తిరువనంతపురం వెళ్లిన సందర్భంగా వచ్చిన జనాలను చూసి అందరు ఆశ్చర్యపోయారు. దీనిపై రాంగోపాల్‌వర్మ ట్వీట్‌ చేస్తూ మలయాళ సూపర్‌స్టార్స్‌ మమ్ముట్టి, మోహన్‌లాల్‌లు కూడా సన్నిని చూసేందుకు వచ్చిన జనాలను చూసి అసూయపడతారని కామెంట్‌ చేశాడు. ఇక 'రాయిస్‌' చిత్రం ప్రమోషన్లలో మీడియాతో పాటు అభిమానులు కూడా షారుఖ్‌ఖాన్‌ కంటే సన్నిలియోన్‌కే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. 

ఇక విషయానికి వస్తే కోట్లాది మందికి శృంగార దేవత అయిన సన్నిలియోన్‌ తాజాగా కాస్త అస్వస్థతకు గురైంది. దీని గురించి ఆమె అభిమానులకు తెలియడంతో వారు తీవ్ర ఆందోళన చెంది తమ వంతుగా పూజలు, యాగాలు, హోమాలు చేస్తూ ఆమె ఆ అనారోగ్యం నుంచి బయటపడాలని ముక్కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. సన్ని ప్రస్తుతం పాపులర్‌ టీవీ రియాల్టీ షో అయిన 'ఎంటీవీ స్ల్పిట్స్‌ విల్లే' సీజన్‌ 11లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఆమె తీవ్రమైన కడుపునొప్పితో బాధపడింది. వెంటనే ఆమెను ఉత్తరాఖండ్‌లోని కాషీపూర్‌లో ఉన్న బ్రిటిష్‌ ఆసుపత్రిలో చేర్పింరారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌ జిల్లాలో ఈ రియాల్టీ షో జరుగుతోంది.

Sunny Leone hospitalised, suffers severe stomach ache:

Sunny Leone hospitalised at Splitsvilla shoot location in Uttarakhand
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs