Advertisement
Google Ads BL

'హిరణ్యకశిప' అప్డేట్ వచ్చింది.. కానీ..?


రుద్రమదేవిని భారీ హంగులతో... సొంతంగా నిర్మించి, డైరెక్ట్ చేసిన దర్శకుడు గుణశేఖర్... ఆ సినిమాతో లాస్ అయ్యాడని చెప్పలేం కానీ... భారీ లాభాలు అయితే మూటగట్టుకోలేకపోయాడనేది జగమెరిగిన సత్యం. రుద్రమదేవి వంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత ఏదన్నా లవ్ స్టోరీ చేస్తే బావుండేది గుణశేఖర్. కానీ మళ్ళీ మరో భారీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టాడు. అది కూడా సురేష్ ప్రొడక్షన్ లో రానా హీరోగా. హిరణ్యకశిప అనే చారిత్రాత్మక చిత్రాన్ని తలపెట్టిన గుణశేఖర్ ఆ సినిమా స్క్రిప్ట్ మీద కూర్చుని రెండేళ్లు కావొస్తుంది. ఇక హిరణ్యకశిపగా రానా పేరు మార్మోగిపోయింది. గత కొన్నాళ్లుగా వార్తల్లో ఉన్న హిరణ్యకశిప... ఈమధ్యన ఎక్కడ వినబడకపోయే సరికి హిరణ్యకశిప ప్రాజెక్ట్ అటకెక్కిందనుకున్నారు.

Advertisement
CJ Advs

కానీ ఈ నగరానికి ఏమైంది ఇంటర్వూస్ లో భాగంగా నిర్మాత సురేష్ బాబు హిరణ్యకశిప ప్రాజెక్ట్ ఉందని కన్ఫర్మ్ చేశాడు. తాజాగా సురేష్ బాబు మాట్లాడుతూ గుణశేఖర్ రెడీ చేసిన హిరణ్యకశిప..... ఆయన దర్శకత్వంలో... మా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో నే ఉంటుందని చెప్పేశాడు. గత రెండేళ్ల నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను గుణశేఖర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కానీ ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎప్పటికి పూర్తవుతుందో అనేది మాత్రం నేను చెప్పలేను. ఈ ప్రీ ప్రొడక్షన్ పనులను.... గుణశేఖర్ తో పాటుగా అప్పుడప్పుడు రానా కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడు.

సురేష్ ప్రొడక్షన్ లో తెరకెక్కబోయే భారీ చిత్రం హిరణ్యకశిపనే అవుతుంది. ఈ సినిమా మా బ్యానర్ కి ఈ సినిమా వెరీ వెరీ స్పెషల్ అవుతుంది అంటూ హిరణ్యకశిప ప్రాజెక్ట్ గురించిన విషయాలను సురేష్ బాబు మీడియా ముఖంగా చెప్పడంతో... ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ ఆసక్తి సినిమా మొదలయ్యేనాటికి ఏ రేంజ్ లో ఉంటుందో అనేది చెప్పడం కష్టమే.

Suresh Babu About Hiranyakasipa:

Rana Daggubati to play Hiranyakasipa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs