సినీ విమర్శకునిగా నందగోపాల్ పరిశ్రమలో చిరపరిచితుడు. ఆయన కుమారులు సినిమా మేగజైన్ కూడా నడిపారు. ఇక మరో కుమారుడు గోపీచంద్ దర్శకునిగా 'మెరుపు' అనే చిత్రం తీశాడు. సినిమాలపై సునిశితమైన విమర్శలు చేయడంలో నందగోపాల్‌ది ప్రత్యేకస్థానం. ఆయన తన 18ఏళ్ల చిన్నవయసులోనే గోపీచంద్ దర్శకత్వం వహించిన 'పేరంటాళ్లు' చిత్రంపై నిర్వహించిన పోటీలో ప్రధమస్థానంలో నిలిచాడు. ఇది 1951 నాటి మాట.
1995లో ఉత్తమ ఫిల్మ్‌క్రిటిక్‌గా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును సొంతం చేసుకున్నాడు. 2000లో ఉత్తమ ఫిల్మ్ జర్నలిస్ట్‌గా దాసరి నారాయణారావు స్వర్ణపతాకం సాధించారు. ఆయన రాసిన 'సినిమాగా సినిమా'కి 2013లో ఉత్తమ సినీ గ్రంథం పురస్కారాన్ని అందించింది. 1985-87 కాలంలో ఆయన ఏపీ సమాచార పౌరసంబంధాల శాఖ అధికార పత్రిక 'తెలుగు వెలుగు'కి ప్రధమ సంపాదకునిగా వ్యవహరించారు. ఇవే గాక ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులను అందుకున్నారు.
ఇక ఈయనను నేడున్న జర్నలిస్ట్‌లలో మోస్ట్ సీనియర్‌గా చెప్పాలి. వాశిరాజు ప్రకాశం, మోహన్‌కుమార్, పసుపులేటి రామారావు, జగన్ వంటి జర్నలిస్ట్‌లు ఆయన తదుపరి తరానికి చెందిన వారు కావడం విశేషం. మొత్తానికి తెలుగు సినీ పరిశ్రమలోని నాలుగైదు తరాలను దగ్గరగా చూసి ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటుగా చెప్పాలి.