Advertisement
Google Ads BL

చిరు చిన్నల్లుడి కోసం బాలయ్య.. నిజమేనా?


మెగాస్టార్ ఫ్యామిలీ నుండి కోకొల్లలుగా హీరోలు పుట్టుకొస్తూనే ఉన్నారు. చిరు కొడుకు, మేనల్లుళ్లు, తమ్ముడి కొడుకు, ఆఖరుకి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా హీరోనే. కాకపోతే చిరంజీవి తన నుండి ఇండస్ట్రీకి వచ్చిన ప్రతిఒక్కరిని సపోర్ట్ చేస్తుంటాడు. ప్రస్తుతం చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ వెండితెరకు విజేతగా పరిచయం కాబోతున్నాడు. శ్రీజ ని పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్ కి హీరో అవ్వాలనే కోరిక కలగడం.. దానికి మామ చిరు సపోర్ట్ దొరకడం అలా అన్ని కలిసొచ్చాయి. కానీ ప్రేక్షకులేమంటారనేది మాత్రం తెలియడానికి కొద్దిగా టైం పడుతుంది. అయితే చిన్నల్లుడు సినిమా మీద బజ్ తెచ్చేందుకు మెగా ఫ్యామిలీ అన్ని ప్రయత్నాలు ప్రారంభించింది.

Advertisement
CJ Advs

నిన్నటివరకు కళ్యాణ్ దేవ్ విజేత ఆడియో వేడుకకి గాని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గాని మెగాస్టార్ చిరంజీవితో పాటుగా కల్యాణదేవ్ బావమరిది రామ్ చరణ్ హాజరవుతాడని అన్నారు. ఇక మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ని ఒకే స్టేజ్ మీద చూడొచ్చని మెగా అభిమానులు హ్యాపీగా ఉన్నారు. తాజాగా కళ్యాణ్ దేవ్ విజేత ఈవెంట్ కి మెగాస్టార్ చిరు తో పాటుగా నందమూరి బాలకృష్ణ కూడా గెస్ట్ గా హాజరవుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. బాలకృష్ణ, చిరంజీవి విజేత స్టేజ్ మీదుంటే కళ్యాణ్ దేవ్ కి భారీ సపోర్ట్ దొరికినట్టే. మరి బాలయ్య చిరులు స్నేహంగానే ఉంటారు. నిజంగానే చిరుతో పాటుగా బాలయ్య ఈ ఈవెంట్ వస్తాడా? అనే డిస్కర్షన్స్ ఫిలింనగర్ హాట్ హాట్ గా మొదలయ్యాయి.

అయితే బాలయ్య బాబు విజేత ఈవెంట్ కి రావడం అనేది జరగదని.. కేవలం విజేత సినిమా బజ్ కోసం ఇలా ఎత్తుగడ వేశారనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. కళ్యాణ్ దేవ్ మొదటిసారి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు గనక బాలయ్య బాబు కూడా ఈ ఈవెంట్ కి వస్తున్నాడు అంటే,.. సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుందని కొందరంటుంటే.. కాదు కాదు విజేత సినిమా నిర్మాత సాయి కొర్రపాటి కోసం బాలకృష్ణ వస్తున్నాడనే టాక్ వినబడుతుంది. సాయి కొర్రపాటితో బాలయ్యకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే సాయి కొర్రపాటి కోసం బాలయ్య విజేత ఈవెంట్ కి వస్తాడంటున్నారు.

Chiranjeevi and Balakrishna Chief Guests for Vijetha Audio Launch!:

Chiru and Balayya Support to Mega Alludu!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs